ఎంపీ వెంకట్రామి రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
హైదరాబాద్: అనంతపురంలో ఎంపీ వెంకట్రామి రెడ్డి ఇంటిని శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు ముట్టడించారు. సీమాంధ్ర ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎంపీ ఇంట్లోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.