అమెరికాలో భారత మహిళా దౌత్యవేత్త అరెస్టు
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వీసా ఫ్రాడ్ నేరారోపణతో భరత దౌత్యవేత్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను బహిరంగంగా చేతులకు సంకెళ్లు వేసి తీనుకెళ్లారు. దేవయాని కోబ్రాగాదే అనే భారత దౌత్యవేత్త సమర్పించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఉందన్న అభియోగంతో అరెస్టు చేసినట్లు అమెరికా పోలీసులు తెలిపారు. ఆమె తన కుమార్తెను పాఠశాలలో దించడానికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. మన్ హట్టన్‌లో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న మరో ప్రవాస భారతీయుడు ప్రీత్ భరారా ఆదేశాల మేరకు ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. దేవయాని తన కుమార్తెల సంరక్షణ బాధ్యతలు చూసుకోడానికి భారత్ నుంచి ఒక మహిళను తీసుకెళ్లారని, ఆ మహిళ వీసాలో తప్పుడు సమాచారం పేర్కొన్నారని, ఆమె పనికి తగిన వేతనం చెల్లించడం లేదని …దేవయానిపై ఆరోపణలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో దేవయాని ఉప కాన్సులేట్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టు చేసే సమయంలో కనీసం ఆమె వివరణ వినడానికి కూడా ఆమెరికన్ పోలీసులు నిరాకరించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని దేవయాని తరపు న్యాయవాది పేర్కొన్నారు.