కేంద్ర మంత్రి శీష్‌రామ్ ఓలా ఇక లేరు
ప్రముఖల నివాళి
న్యూఢిల్లీ, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
కేంద్ర మంత్రి శీష్‌రామ్ ఓలా (86) కన్నుమూశారు. ఆదివారం గుర్ గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విబిచారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఓలాకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1927, జులై 30న జన్మించిన ఓలా రాజస్థాన్‌లోని జున్‌జుహ్ను నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. అక్కడి ప్రముఖ తెగ జాట్ నాయకునిగా గుర్తింపుపొందారు. రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా 1957 నుండి 1990 వరకు కొనసాగారు. 1980 నుండి 1990 వరకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1996-1997లో కెమికల్స్, ఎరువుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1997-1998లో వాటర్ రిసోర్సెస్ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2004, మే 23 ఉండి 2004 నవంబర్ 27 వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఉపరాష్ట్రపతి సంతాపం
కేంద్ర మంత్రి శీష్‌రాం ఓలా మృతి పట్ల ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముసాయిదా ప్రవేశపెట్టండి