ఓయూలో మంత్రి శ్రీధర్ బాబు దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత శ్రీరాం అరెస్ట్‌ను నిరసిస్తూ…ఇవాళ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంత్రి శ్రీధర్ బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ అక్రమంగా శ్రీరాంను అరెస్టు చేశారని ఆరోపించారు. శ్రీధర్‌బాబు అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. 24 గంటల్లో శ్రీరాంను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.