పీవీ ఙ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన నేతలు
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 9వ వర్ధంతి సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఙ్ఞానభూమి వద్ద నావాళులర్పించారు. పీవీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం పై కాంగ్రెస్ సీనియర్‌నేత వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతి ఐక్యత పేరుతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న సీఎంకు పీవీ వర్ధంతికి రావాలన్న స్ఫృహ లేకపోవడం బాధాకరమని విమర్శించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, భాజపా జాతీయ ఉపాధ్యాక్షుడు బండారు దత్తాత్రేయ, తదితరులు పీవీ సమాధి వద్ద నివాళులర్పించారు.