ఢిల్లీ పీటంపై సామాన్యుడు
26న ప్రమాణ స్వీకారం
హై సెక్యూరిటీ వద్దన్న కేజ్రీవాల్
షరతులు వర్తిస్థాయి : షీలాదీక్షిత్
న్యూఢిల్లీ, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
ఢిల్లీ పీటాన్ని ఓ సామాన్యుడు అధిరోహిస్తున్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఓ మామూలు వ్యక్తి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించబోతున్నాడు. తన ఉద్యమం ద్వారా ఏ పార్టీనైతే చావు దెబ్బ తీశాడో అదే పార్టీ కాంగ్రెస్ మద్దతుతోనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. తాను ఎప్పటికీ సామాన్యుడినేనని గుర్తు చేస్తూ జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తామన్నా నిరాకరించాడు. ఈనెల 26న రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన ఆమ్‌ఆద్మీ పార్ట శాసనసభాపక్షం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తొలిసారిగా ఓ సామాన్యుడు ఢిల్లీ గద్దె ఎక్కుతున్నాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమైంది. మొత్తం తాను గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి మరీ తాము అధికారం చేపట్టాలో వద్దో ఆప్ నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కేజీవ్రాల్ పార్టీకి మద్దతు ఇచ్చిందని అంటున్నారు. గతంలో ప్రైవేటు కంపెనీలకు దన్ను ఇచ్చిందంటూ షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజీవ్రాల్ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలన్నీ ఆచరణ సాధ్యమేనని, తాము షరతులతో కూడిన మద్దతునే ఆ పార్టీకి ఇస్తున్నామని షీలా దీక్షిత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ విధానాలకు తప్పనిసరిగా అంగీకరించాలని, ఒకవేళ మధ్యలో కూలదోసే ప్రయత్నం చేసినా కూడా అది తమకు సానుభూతి తెస్తుందని కేజీవ్రాల్ స్పష్టం చేస్తున్నారు. పార్టీ సమావేశం అనంతరం కేజీవ్రాల్ విూడియాతో మాట్లాడుతూ… ప్రజాభిప్రాయం సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాము సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏడు లక్షల మంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసన సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఏఏపీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజీవ్రాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నకున్నారు. అతను ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి షీలా దీక్షిత్‌ను ఓడించారు. ఆమ్ ఆద్మీనేత శిసోడియా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజీవ్రాల్ ఉంటారని తెలిపారు. లెప్టినెంట్ గవర్నర్ అంగీకరిస్తే జంతర్‌మంతర్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అయితే షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజీవ్రాల్.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షరతులతో కూడిన మద్దతే ఉంటుందని షీలా దీక్షిత్ చెప్పారు. బేషరతు మద్దతని ఎప్పుడూ చెప్పలేదని షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని షీలా దీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను ఆమ్ ఆద్మీ పార్టీ నెరవేరుస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం షీలాదీక్షిత్ స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్‌ఆద్మీ పార్టీ నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. బిజెపి శాసనసభాపక్ష నేత హర్షవర్థన్ మీడియాతో మాట్లాడుతూ. ఢిల్లీ ప్రజలను ఆమ్‌ఆద్మీపార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయకర్త కేజీవ్రాల్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీపార్టీ ప్రకటించిన అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజీవ్రాల్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు 33 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు, కాంగ్రెసు పార్టీ 8 స్థానాలలో గెలిచిన విషయం తెలిసిందే. కేజీవ్రాల్ ప్రమాణ స్వీకారానికి రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసి ప్రభుత్వ ఏర్పాటకు ముందుకు వచ్చారు. ఇదే విసయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి నివేదించారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్ మంతర్‌లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ముందు అనుకున్నారు. ప్రమాణ స్వీకారం మొదట జంతర్ మంతర్ వద్ద చేద్దామనుకున్నా తర్వాత రామ్‌లీలా మైదానానికి మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు కేజీవ్రాల్ అధికారికంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖను లెప్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి పంపుతారు. మొత్తం తాము గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి అధికారం చేపట్టాలని ఏఏపీ నిర్ణయించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏఏపీకి 6 లక్షల 97 వేల ఎస్‌ఎంఎఎస్‌లు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఏఏపీ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి కాంగ్రెస్ 9సీట్లతో మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని,అందుకు షీలాదీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను ఏఏపీ నెరవేరుస్తుందన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. ఏఏపీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నిర్ణయాన్ని బిజెపి వ్యతిరేకించింది. కాంగ్రెస్ వ్యతిరేకతతో సీట్లు సాధించి ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది.