75వ స్వతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు ప్రారంభం

జిల్లా సంక్షేమ అధికారిని ముసాయిదా బేగం
మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) మల్డకల్  ప్రాజెక్టు పరిధిలోని గట్టు,అయిజ,మల్డకల్ మండలాల అంగన్వాడీ టీచర్ లకు ప్రాజెక్టు స్థాయి సమావేశం సోమవారం  నిర్వహించారు. ఈ సమావేశానికిముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారిణి ముసాయిదా బేగం హాజరు అయ్యారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి ముసాయిదా బేగం మాట్లాడుతూ 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సావాల  వేడుకలను  ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ  మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుండి  వెలువడిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 8 వ తేదీ నుండి 22 వరకు జరగాల్సిన రోజు కార్యక్రమాల వివరిస్తూ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలిని ఆమె ఆదేశించారు. సిడిపిఓ కమలాదేవి అంగన్వాడి టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమయ పాలన, ప్రీ స్కూల్ నిర్వహణ,ఆరోగ్య లక్ష్మి, మెనూ, అంగన్వాడీ కేంద్రాల పరిశుభ్రత పై,రికార్డుల నిర్వహణ లపై రోజు మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రుల కు ప్రతి బుధవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ చేయాలి అని చెప్పారు. అంగన్వాడి టీచర్లు నిర్లక్ష్యం వహించిన శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంగన్వాడి సూపర్వైజర్లు నాగరాణి, బాలమ్మ మూడు మండలాల అంగన్వాడీ టీచర్ లు తదితరులు పాల్గొన్నారు.