75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు06,జనంసాక్షి,,,,
  రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను  నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని    అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ   శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   అధికారులకు సూచించారు.
 శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో  జిల్లా అధికారులతో   మంత్రి జడ్పి ఛైర్పర్సన్, జిల్లా పాలనాధికారి లతో  కలసి    వజ్రోత్సవాల నిర్వహణ  సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పండుగ వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకుంటూనే ప్రతి ఇంటి పైన జెండా ఆవిష్కరణలు గావించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 16వ తేదీన ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడ సామూహిక జాతీయ గీతాలాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. 17వ తేదీన రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసేందుకు వైద్యాధికార చర్యలు చేపట్టాలన్నారు 18వ తేదీన క్రీడల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి సూచించారు 19న దవఖానాలు అనాధ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు జైలలో పండ్లు,  స్వీట్లు పంపిణీ చేపట్టాలని డీఈఓ కు సూచించారు 20న దేశభక్తి,  జాతీయ స్ఫూర్తిని చాటేలా ముగ్గుల పోటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 22న వజోత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం  మున్సిపల్ అధికారులు,  సంబంధిత  అధికారులు,  ఎంపీడీఓ, ఎంపీవో లతో  సమావేశం  నిర్వహించి  దిశా నిర్దేశం చేశారు.  సమగ్ర  కుటుంబ సర్వే ప్రకారం  ఇంటింటికి జాతీయ జెండా ను ఆవిష్కరించే  విధంగా చర్యలు చేపట్టాలని,  12న  జాతీయ  సమైక్య రక్షా బంధన్ రోజున టెలీ కాస్ట్ చేయాలని,  రక్త దాన శిబిరం  నిర్మల్,  బైంసా లలో  ఏర్పాటు చేయాలని,  గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.
      సమావేశంలో అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు,  హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు