బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను… అలజడి
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
వాయవ్య దిశగా పయనిస్తున్నఅల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని ప్రాంతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది. కాగా, ఈ అల్పపీడనం అక్టోబరు 22 నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు… ఈ నెల 20, 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు… సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 21 కల్లా తిరిగొచ్చేయాలని సూచించింది.