తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

మరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెండు కేసుల్లో వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా పలువురి పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. కౌంటర్‌కు రిజాయిండర్‌ దాఖలు చేస్తామని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్‌ 17కి వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందని పేర్కొంది.