75 వ స్వాతంత్ర్య దినోత్సవం

గరిడేపల్లి, ఆగస్టు 15 (జనం సాక్షి):శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రంలో  75 వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమం సందర్భంగా కేవీకే  ప్రాంగణంలో ఇంచార్జీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అధిపతి బి. లవకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి  జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 75 సంవత్సరాలలో భారతదేశంలో శాస్త్రవేత్తల పరిశోధనల మూలంగా  ఎంతో మంది మేధావుల నిపుణుల నిరంతర కృషి వల్ల ఎన్నో రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించగలిగామని దీనిని స్ఫూర్తిగా తీసుకోని యువత దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సోమవారం  అధ్యాత్మిక తత్వవేత్త శ్రీ అరబిందుల  వారి 150 వ జన్మదిన సందర్భంగా కెవికె లో శ్రీ అరవిందుల  వారి జీవిత విశేషాలపై  రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శింపజేసీ  వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెవికె  వ్యవస్థాపకులు స్వర్గీయ డా. గంటా గోపాల్ రెడ్డి  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఆఫీస్ సిబ్బంది, బి యస్సీ వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు, జడ్.పి.హెచ్.ఎస్ గడ్డిపల్లి టీచర్ విద్యార్థినులు పాల్గొన్నారు.