75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొత్త కలెక్టరేట్ ఆవరణలోనే నిర్వహించడం జరుగుతుందని తమ తమ శాఖలు ద్వారా ఏర్పాటు చేయవలసిన పనులను కలెక్టర్ సమీక్షించారు. సంక్షేమ శాఖలు తమ శాఖ ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయాలని , పాఠశాల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా విద్యా శాఖతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రుణాలు, ఆస్తుల పంపిణీ సంబందించి సంబందిత శాఖలు ముందుకు నివేదిక తయారు చేసుకోవాలని , ముఖ్య అతిధి సమక్షంలో వాటిని లబ్ధి దారులకు అందజేసేందుకు అని చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ తమ టిమ్ తో సిద్ధంగా ఉండాలని, అగ్ని మాపక శాఖ వారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు డెమో నిర్వహించాలని, విద్యుత కు అంతరాయం లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జడ్పీ సీఈఓ కృష్ణా రెడ్డి, కలెక్టరేట్ ఏవో నాగేశ్వర చారి, ఏసీపీ వెంకట్ రెడ్డి, సిపిఓ మాన్య నాయక్, ఇడి ఎస్సీ డెవలప్మెంట్ యం.జైపాల్ రెడ్డి, ఇడి ఎసీ కార్పొరేషన్ శ్యామ్ సుంధర్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పంచాయితీ అధికారి సునంద, డిఈఓ నారాయణ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి మల్లిఖార్జున్ , మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో , సూరజ్ కుమార్, విద్యుత్ శాఖ, ఫైర్, సంబందిత అన్నీ శాఖల అధికారులు పాల్గొన్నారు.