తెలంగాణ బిల్లుకు కేంద్రకేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ దాదాపు రెండు గంటలపాటు జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తెలంగాణ బిల్లుపై చర్చించిన అనంతరం సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు.రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ దాదాపు రెండు గంటలపాటు జరిగిన కేంద్ర కేబినేట్‌ భేటీలో తెలంగాణ బిల్లుపై చర్చించిన అనంతరం మంత్రులు బిల్లుకు ఆమోదం తెలిపారు. సమావేశం జరిగిన అనంతరం మంత్రి ప్రపుల్‌ పటేల్‌ ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ బిల్లు సోమవారం పార్లమెంట్‌ ముందుకు రానుంది. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రుతి జైపాల్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. తెలంగాణ బిల్లులో ఏవైనా సవరణలు చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. కొంచెం సేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే వివరాలు వెల్లడిస్తారని సమాచారం.