ప్రజలు కోరిన పాలన అందిస్తామో లేదో : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన జర్నలిస్టుల జాతర సభకు మాజీ మంత్రి జానారెడ్డి హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కోరిన పరిపాలన అందిస్తామో లేదో అన్న భయం మాలో ఉందని తెలిపారు. తెలంగాణ సాధించింది అధికారం కోసం కాదని… ప్రజల ఆశయాలు తీర్చడానికని పేర్కొన్నారు. సామాజిక న్యాయంతో కూడిన పాలన అవసరమన్నారు.