ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
కోల్‌కతా, మార్చి 17
(జనంసాక్షి) :
భవిష్యత్‌పై గంపెడాశలతో ఐఐటీలో అడుగుపెట్టిన మరో తెలుగు విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఉన్నత విద్యనభ్యసించడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లిన తెలుగు విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బోగ శ్రవణ్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునిది నల్గొండ జిల్లాలోని రఘునాథపురం మండలం రాజుపేట. ఇంటర్యూలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఐఐటిల్లో విద్యార్థుల మరణ మృదంగంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.