భాజపా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ప్రకాశ్ జవదేకర్
భాజపా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: ప్రకాశ్ జవదేకర్
హైదరాబాద్: భారత జనతపార్టీతోనే సీమాంధ్ర, తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భాజపాలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందన్నారు. సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరాలంటే భాజపా పార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలో నీటి సమస్యలు ఉన్నాయని పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో ఎక్కువ పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకెళ్తున్నామన్నారు. సీమాంధ్రలో ప్యాకేజీ అమలు కావాలంటే భాజపా రావాల్సిందేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా సీమాంధ్ర ప్రజల తరపున భాజపా పోరాడిందన్నారు. భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమని స్సష్టం చేశారు. భాజపా నేతలు కృష్ణంరాజు, పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.