పీజీ వైద్య విద్య ప్రవేశ అక్రమాలు నిజమే
గవర్నర్‌కు వేణుగోపాల్ నివేదిక
సీఐడీ విచారణకు ఆదేశించిన గవర్నర్
హైదరాబాద్, మార్చి 24 (జనంసాక్షి) :
పీజీ వైద్య విద్య ప్రదేశ పరీక్షలో అక్రమాలు నిజమేనని వేణుగోపాల్ గవర్నర్‌కు నివేదిక స మర్పించారు. ఇటీవల నిర్వహించిన పీజీ మె డికల్ ప్రవేశ పరీక్షలో కొందరు అభ్యర్థులకు 1 80 వరకు మార్కులు రావడంతో పరీక్ష రాసిన వారంతా అవాక్కయ్యారు. పేపర్ టఫ్‌గా రావ డంతో హై స్కోర్ 150
రావడమే కష్టమనుకుంటే చాలా మందికి 180 వరకు మార్కులు రావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఎంబీబీఎస్ వైద్యులు తెలిపారు. అక్రమాలు జరిగితే తప్ప అంత స్కోరు సాధ్యం కాదని, దీనిపై విచారణ జరపాలంటూ వారు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు విచారణ పూర్తి చేసిన వేణుగోపాల్ సోమవారం తన నివేదికను గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. వెంటనే స్పందించిన గవర్నర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటూ సీఐడీ డీజీ కృష్ణప్రసాద్‌ను ఆదేశించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగాన్ని సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.