టీ జేఏసీ నేతలకు కాంగ్రెస్ టికెట్లు
జనంసాక్షి: కాంగ్రెస్ అధిష్టానం మూడు స్థానాల్లో అభ్యరులను మార్పుచేసి, టీ. జేఏసీ నేతలకు టికెట్లు ఖరారు చేసింది. కంటోన్మెంట్ – గజ్జెల కాంతం, నర్సంపేట – కత్తి వెంకటస్వామి, తుంగతుర్తి – అద్దంకి దయాకర్. వీరికి టికెట్లు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. టీ.జేఏసీ నేతలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయి, టికెట్ల విషయమై చర్చలు జరిపారు. అధిష్టానం ఆదేశాల మేరకే ఈ మార్పులు జరిగాయి. కాగా ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎంపిక చేసిన అభ్యర్తులకు బిఫారం పట్టాలను అందజేశారు.