మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి
(జనంసాక్షి) : నెల రోజులు గడిచిన తమ వారి జాడా తెలపక పోవడంతో ఆ్రగహం వ్యక్తం చేస్తున్న బంధువులు. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత మిస్టరీ సంఘటనగా చెబుతున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి చేరింది. అత్యంత భారీ ఖర్చుతో సాగుతున్న విమానం అన్వేషణ కోసం అవుతున్న ఖర్చు కొత్త రికార్డులు సృష్టిస్తోంది… 239మంది ప్రయాణికులు, 5గురు సిబ్బంది గళ్లంతయి నెలరోజులు దాటుతున్నా ప్రమాదం జరిగిన చోటును కనిపెట్టలేని టెక్నాలజీ నిస్సాహయతలపై బందువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది…
మలేషియా ఎయిర్ లైన్ విమానం గల్లంతయి నెలరోజులు దాటడంతో బందువుల ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. ఇంతగా అభివద్ది చెందిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నా, విమానం ఆచూకీ ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత మిస్టరీ సంఘటనగా నమోదయిన ఈ విమానం కథలో బయటపడిన మరో కొత్తకోణం మలేషియాని ఆందోళనలో పడేస్తోంది…ఏకధాటిగా సాగుతున్న అన్వేషణ నిష్ప్రయోజనం కానుందా? అసలు విమానం ఎక్కడుంది? ఏనాటికయినా ఈ సీక్రెట్ మిస్టరీ బయటపడుతుందా? ప్రస్తుతానికి మాత్రం అన్నీ ప్రశ్నలే…
విమానం కూలిపోయిన చోటును గుర్తించడం ప్రపంచానికి ఓ సవాలుగా మారింది…ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా విమానం అన్వేషణ ఖర్చు హద్దులు దాటిపోయింది. సముద్రం లోలోతుల్లో చిక్కుకుపోయిన విమానం ఆచూకీని తెలుసుకోవడం అంత ఈజీ విషయమేమీ కాదంటున్నారు అన్వేషకులు..
దక్షిణ పశ్చిమ హిందూమహా సముద్రంలో డీప్ సీ సెర్చి ఆపరేషన్ అంతు సులువైనది కాదు. కనీసం 15కిలోమీటర్ల లోతులో కూరుకుపోయిన విమానం బ్లాక్ బాక్స్ సిగ్నల్ ఉపరితలానికి అందనంత బలహీనంగా ఉంటాయి…కొన్నిసార్లు సముద్రంలో ఉండే చలనాల వల్ల సిగ్నల్ వస్తూ పోతూ ఉండటమే ఈ అయోమయస్తితికి కారణమవుతోంది. మొన్నటికి మొన్న చైనా అన్వేషణ నౌకకు అందిన బ్లాక్ బాక్స్ పింగ్ సిగ్నళ్ళు ఇప్పడు ఆగిపోయాయి…దాంతో అన్వేషకుల కథ మళ్లీ కంచికి చేరింది.
ఇకపోతే అన్వేషణ కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చిన యూరోపియన్ దేశాలు తమవంతు పాత్రను పోశిస్తున్నాయి..ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజీలాండ్, దక్షిణ కొరియాలతో బాటు మలేషియా కూడా ఈ పనిలో పాలుపంచుకుంటోంది…విమానం ఆచూకి దొరుకుతుందో లేదో చెప్పలేకపోయినా అన్వేషణ ఖర్చులు మాత్రం చుక్కలు చూపించేందుకు సిద్దంగా ఉన్నాయి.
సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న వివిధ దేశాల సిబ్బంది కోసం ఆహారం విడిభాగాల సరఫరా కోసం దక్షిణ కొరియా పెడుతున్న ఒకరోజు ఖర్చు 5.6 మిలియన్ల డాలర్లంటే వ్యవహారం ఏస్థాయిలో ఉందో తేలికగా అంచనా వేసుకోవచ్చు…అన్వేషణలో పదుల సంఖ్యలో దేశాలు, విమానాలు, నౌకలు, సబ్మెరిన్…హిందూ మహా సముద్రం పరిదిలో కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్న తరుణంలో మనదేశం సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేష్ లో పాల్గొంది…
అయతే ఎవరూ ఊహించని విధంగా అన్వేషణలో పాల్గొంటున్న దేశాలు తమ ఖర్చును చెల్లించాలని మలేషియాకు బిల్లు పంపిస్తే మలేషియాకు మైండ్ బ్లాంక్ అవడం తప్పదు…ఇంత ఖర్చును ఆదేశం చెళ్లించగలుగుతుందా? అదృశ్యమయిన ప్రయాణికులకు చెళ్లించాల్సిన నష్టపరిహారం కూడా మలేషియా వెన్నువణికించేలా ఉండబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రమాదం విషయం పక్కనబెడితే అన్వేషణలో వెలుగుచూసిన కొత్తకోణం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. మలేషియా విమానం అన్వేషణ చావుబతుకుల్లో వెంటిలెటర్ పై ఉన్న రోగిప్రాణంతో పోలుస్తున్నారు. ఇప్పుడయితే సానుభూతితో పనులు కానిస్తున్నా దానికీ ఓ హద్దు ఉంటుంది. అది దాటి ఏ దేశం కూడా తనకు మాలిన ధర్మాన్ని పాటించబోదని నిపుణులు చెబుతున్నారు. ఆ పరిస్తితిని మలేషియా ఎలా ఎదుర్కుంటుందో చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయకతప్పదు…