ప్రాణం తీసిన ఓటు …
(జనంసాక్షి) :ఓటు హక్కును వినియోగించుకుని స్వగ్రామానికి తిరుగుప్రయాణమైన ఓ వృద్దురాలు అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో చోటు చేసుకుంది..
కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిద్దెమీదపల్లెకు చెందిన వెంకటమ్మ(75) సమీపంలోని మొగిళ్లకాల్వ పోలింగ్ కేంద్రంలో ఈ రోజు ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు వినియోగం అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యేందుకు కేంద్రం నుంచి బయటకు రాగానే తీవ్ర అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న కొంతమంది వెంకటమ్మను 108 వాహనం ద్వారా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం చేశారు. ఆసుప్రతికి చేరకముందే వెంకటమ్మ మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.