రేపిస్టులకు ఉరిశిక్ష తగదు


తేనెతుట్టె కదిపిన ములాయం
మొరాదాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
అత్యాచార కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించడం సరికాదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములా యం సింగ్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహిం చిన ఎన్నికల ప్రచార సభలో రేపిస్టులకు ఉరి శిక్షపై వ్యాఖ్యలు చేసి మహిళల ఆగ్రహానికి కార కులయ్యారు. ముంబైలో గడిచిన వారంలో రెండు గ్యాంగ్‌ రేప్‌ ఘటనల్లో దోషులకు కోర్టులు మరణ శిక్ష విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. యువకులు తప్పు చేస్తారు అయితే వారికి మరణశిక్ష విధించాలా అంటూ న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ముంబైలోని
శక్తి మిల్స్‌లో ఓ మహిళా ఫొటో జర్నలిస్టు, టెలిఫోన్‌ ఆపరేటర్‌పై అత్యాచారం చేసిన ముగ్గిరికి స్థానిక సెషన్స్‌ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ములాయం యువతులు, మహిళలను కించపరిచేలా మాట్లాడారు. అంతవరకు బాగనే ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య విభేదాలు వస్తాయి. ఆ తర్వాత అమ్మాయిలు వెళ్లి తమపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేస్తారు. పాపం యువకులకు మరణశిక్ష వేస్తారని మూలాయం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మారుస్తామని, తప్పుడు కేసులు పెట్టిన వారిని శిక్షిస్తామని కూడా తెలిపారు. అత్యాచారాలపై కోర్టులు విధిస్తున్న కఠిన శిక్షలపై ములాయం వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. తాను అధికారం చేపడితే రేపిస్టులకు అనుకూలంగా చట్టాలు మారుస్తాననడంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు మహిళా సంఘాలు ములాయం వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి.