అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే తెలంగాణ

సీమాంధ్రుల మనోభావాలతో తెదేపా, వైకాపా, భాజపాలు
ఆడుకున్నాయి : రాహుల్‌
అనంతపురం, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలతో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు ఆడుకున్నాయని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ ఎవరి జాగీరూ కాదు.. పదేళ్ల పాటు ఆంధ్రా వారు హైదరాబాద్‌లో ఉండొచ్చని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజలకు హైదారబాద్‌లో తాము భద్రతగా నిలుస్తామని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పదేళ్ల పాటు హైదరాబాద్‌లో ఆంధ్రా విద్యార్థులు యథావిధిగా విద్యావకాశాలు కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరంతో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ ఎవరి జాగీరు కాదని, పదేళ్లు ఆంధ్రావారికి అవకాశం ఉంటుందని రాహుల్‌ గాంధీ తెలిపారు. హైదరాబాద్‌ లో నివసిస్తున్న సీమాంధ్రుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయపార్టీలు లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. అందరూ అంగీకరించిన తరవాతనే విభజనకు పూనుకున్నామని అన్నారు. తెదేపా, వైకాపా, భాజపా తదితర పార్టీలు లేఖలు ఇవ్వడంతోనే కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని రాహుల్‌గాంధీ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌దే తప్పంటున్నారని, కాంగ్రెస్‌ ఎప్పుడూ తప్పు చేయదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని రాహుల్‌గాంధీ అన్నారు. ఆంధప్రదేశ్‌ను నవ్యాంధప్రదేశ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పిస్తామన్నారు. సీమాంధ్రను విద్య, వైద్యపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలలోపు కొత్త రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. ఐఐటీ, ఎంఐటీ, ఐఐఎం, ఏఐఎంఎస్‌, పెట్రోలియం, ట్రైబల్‌ యూనివర్సిటీ తదితర సాంకేతికపరమైన విద్యాసంస్థలను ఏర్పాటుచేస్తామన్నారు. వచ్చే పదేళ్ల పాటు హైదరాబాద్‌ లో ఆంధ్రా విద్యార్థులకు యథావిధిగా విద్యావకాశాలు ఉంటాయన్నారు. ఆరు నెలల్లో సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుతో ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అంధిస్తామన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ పార్టీ దోషి కాదని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు పలు అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీని సెంట్రల్‌ యూనివర్సిటీ చేస్తామని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, విశాఖపట్టణం దాహార్తి తీరుస్తామని రాహుల్‌ తెలిపారు. విశాఖపట్టణం చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి పలు అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంటే తమకు ఎంతో అభిమానమని ఆయన అన్నారు. హిందూపురంలో జరిగిన కాంగ్రెస్‌ ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి కాంగ్రెస్‌ విలువ ఇస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజల కోసమే సోనియాగాంధీ పదేళ్లు పాటు ప్రత్యేక రాయితీలు కల్పించారని తెలిపారు. ఆంధప్రదేశ్‌కు రాజధానిని ఆరునెలల్లో నిర్ణయిస్తామన్నారు.సీమాంధ్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌, ఏపీ ప్రచార సారథి చిరంజీవి, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన ప్రచారసభలో ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందన్నారు. 7.5 లక్షల ఎకరాలకు నీరు అందించే దిశగా, విశాఖ నగరానికి తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్ర వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఆంధప్రదేశ్‌ను సత్వర అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడానికి వచ్చానని, తాము మాట ఇస్తే దాన్ని తప్పక అమలు చేస్తామని రాహుల్‌ అన్నారు. సీమాంధ్రను అగ్రగామి రాష్ట్రంగా మారుస్తామన్నారు. అధికారంలోకి రాగానే బీసీ, కాపు కులాలను వెనుకబడిన తరగతులుగా, వాల్మీకులను ఎస్సీ, ఎస్టీ కులాల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. హంద్రీనీవా పథకం కింద రూ.6850 కోట్లతో 3.5లక్షల ఎకరాలకు నీరు తీసుకొచ్చే ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తిచేస్తామన్నారు. టిడీపీది ఇదే చివరి పోరాటమని కాంగ్రెస్‌ నేత చిరంజీవి పేర్కొన్నారు. సీఎం కావాలనే ఆశతో చంద్రబాబు బీజేపీతో అనైతికంగా పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో జగన్‌ మోడీతో కలుస్తారని జోస్యం చెప్పారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే జగన్‌ పదవి కోసం పోరాడుతున్నారని ధ్వజమెత్తారు.