చెన్నైలో బాంబు పేలళ్ల ఘటన దురదృష్టకరం : ఖర్గే
న్యూఢిల్లీ, మే 1 : చెన్నైలో బాంబు పేలుళ్ల ఘటన దురుదృష్టకరమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పేలుడు ఘటనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫ్లాట్‌ఫాం పైకి వచ్చిన 10 నిమిషాల్లోనే పేలుళ్లు జరిగాయని వెల్లడించారు. పేలుళ్లపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఖర్గే తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువతి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు.