తెలంగాణ పీఠం మాకే : పొన్నాల
హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వం తమదేనని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మ య్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాం గ్రెస్ పార్టీదే ఘన విజయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఓడిపోతే ఆ బాధ్యత తనదేనని తెలిపా రు. శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి దా నం నాగేందర్‌తో కలిసి పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం మా దేనని బల్లగుద్దీ మరీ చెప్పారు. పూర్తి స్థాయి మె జార్టీ స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తామని, హంగ్ ఏర్పడే అవకా శమే లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి మైండ్‌గేమ్ ఆడుతోందని పొన్నాల విమర్శిం చారు. ఆ పార్టీ ఎన్నికల తర్వాత కూడా మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. అధికారం ఇస్తే సరి.. లేదంటే విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెప్పుకొచ్చారని, ప్రజలను మభ్యపెట్టేందుకు రకరకాల హామీలు ఇచ్చారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతాలు, పునాదులే లేవని.. సొంత అభ్యర్థులు లేని పార్టీ గెలుస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదన్న పార్టీ నేతల వ్యాఖ్యలతో పొన్నాల విభేదించారు. తెలంగాణ
ఇచ్చామన్న వాదనను, తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్న గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి వెళ్లలేదనడం వితండ వాదమని తెలిపారు. తాము చేయాల్సిందంతా చేశామని, ప్రచారం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించామన్నారు. మాకు స్టార్ క్యాంపెయినర్ లేరనడం సరికాదని, ప్రతీ కార్యకర్త మాకు స్టార్ క్యాంపెయినరే అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైందని, తమ విజయంపై ఎలాంటి సందేహం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే తనదే బాధ్యత అని చెప్పారు. సోనియా, రాహుల్ సభలతో కాంగ్రెస్ బలపడిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 16 సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని అవాస్తవమని చెప్పారు. ఇతర పార్టీల ప్రకటనలు మాటల వరకే పరిమితమని తెలిపారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు.