రాందేవ్‌ బాబా తల ఇవ్వండి

కోటి తీసుకెళ్లండి శ్రీబీఎస్పీ నేత భగవాన్‌సింగ్‌

చండీగఢ్‌, మే 5 (జనంసాక్షి) :

దళిత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్‌ బాబా తలకు ఓ బీఎస్పీ నాయకుడు వెల కట్టారు. ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయల నజరా నా ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. హోషియాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి బ హుజన సమాజ్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న భగవాన్‌సింగ్‌ రాందేవ్‌బాబా తలకు వెల కట్టి అది తెచ్చి ఇచ్చిన వారికి కోటి రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్ర కటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సమయంలో రాందేవ్‌ బాబా రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసు కొని దళిత మహిళలను కించపరిచేలా మాట్లాడారు. హోషియాపూర్‌లోని బస్టాండ్‌ వద్ద రాందేవ్‌ బాబా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భగవాన్‌సింగ్‌ మాట్లాడుతూ రాందేవ్‌ బాబాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తాను అలా అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాందేవ్‌ బాబా మొత్తం దళిత మహిళలను అవమానించినప్పుడు తాను అలా మాట్లాడడనని అన్నారు. అయితే రాందేవ్‌ బాబా తలకు వెల కట్టిన వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని హోషియాపూర్‌ డెప్యూటీ కమిషనర్‌ కశ్యప్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.