శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎర్రచందనం పొడి

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎర్రచందనం పొడిని కస్టమ్ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి రూ.రెండు లక్షల జరివామా వేసి వదిలివేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే… సూడాన్ దేశానికి చెందిన జాఫర్ ముస్తామా అనే వ్యక్తి ఖతార్ ఎయిర్ వేస్‌లో దోహా వెళుతుండగా అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 20 కిలోల ఎర్రచందనం పొడి లభించింది. దీని విలువ మూడు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో విచారిస్తున్నారు.