పాకిస్థాన్లో బాంబు పేలుడు: ఎనిమిది మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దక్షిణ వజీరిస్థాన్లో సెక్యురిటీ ఫోర్సు హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఆ పేలుడులో ఎనిమిది మంది మరణించారని స్థానిక మీడియా డ్వాన్ వెల్లడించింది. ఆ పేలుడులో పలువురు భద్రత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ఆ పేలుడు తీవ్రవాదుల పనిగా అనుమానిస్తున్నామని, అయితే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ పేలుడుకు పాల్పడ్డారని డ్వాన్ పత్రిక వివరించింది.