శ్రీవారిని దర్శించుకోనున్న బాబు

తిరుపతి : తెలుదేశం పార్టీ అధినేత, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్మామి వారిని దర్శించుకోనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలీకాప్టర్‌లో తిరుపతికి బయలుదేరి ఉదయం 5 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటునుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇక తిరుమల నుండి బయలుదేరి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయన తల్లిదండ్రులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం తిరిగి ఉదయం 9.15కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మొదటిసారిగా బాబు తన స్వగ్రామానికి వస్తుండటంతో పార్టీ వర్గాలు బాబుకి ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.