తిరుమలగిరిలో ఆర్టీసీ బస్సు అపహరణ

నల్గొండ, మే 18 : జిల్లాలోని తిరుమలగిరిలో జమగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం అపహరణకు గురయ్యింది. బస్సు ఎం. ఏపీ 36 జెడ్ 0164. బస్సు అపహరణకు గురవ్వడంతో తీవ్ర సంచలనం రేగింది. వరంగల్ జిల్లా జమగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరిలో వివాహానికి సంబంధించి ఒప్పందం చేసుకుని పెళ్లి బృందాన్ని బస్సులో ఎక్కించుకుని తిరుమలగిరి భవాని ఫంక్షన్ హాలులో పెళ్లి బృందాన్ని దించేసి బస్సు డ్రైవర్ భోజనానికి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి తిరుమల గిరి పోలీస్ స్టేషన్‌లో బస్ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీటీ బస్సు మాయం కావడంతో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.