దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌కు ఘన నివాళి
న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి):
దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పలువురు ప్రముఖులు, నేతలు స్మరించుకున్నారు. బుధవారం రాజీవ్ 23వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి ‘వీర్‌భూమి’ వద్ద ప్రము ఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారీ, మన్మోహన్‌సింగ్ తదతరులు శ్రద్ధాంజలి ఘటించారు. రాజీవ్ సతీమణి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాం క, అల్లుడు రాబర్ట్ వాద్రా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఉదయమే వీర్‌భూమి వద్దకు
చేరుకున్న సోనియా కుటుంబ సభ్యులు చాలాసేపు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు దేశభక్తి గీతాలు ఆలపించారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మువ్వన్నెల జెండాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చిన్నారులు రాజీవ్‌కు నివాళులు అర్పించారు. కేంద్ర మాజీ ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, కమల్‌నాథ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజీవ్‌కు ట్విట్టర్‌లో నివాళులు అర్పించారు. అతిపిన్న వయస్సులో భారత్‌కు ఆరో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ 1991 మే 21న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపేరంబుదూర్‌కు వెళ్లిన ఆయనను దుండగులు హతమార్చారు.
రాష్ట్రంలోనూ రాజీవ్‌కు ఘన నివాళులు..
హైదరాబాద్ పంజగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీల అధ్యక్షులు రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు, వట్టి వసంత్‌కుమార్ తదితరులు రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.