కూలీలపైకి దూసుకువెళ్ళిన లారీ: ముగ్గురు మృతి

కరీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించిన దారుణం శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న లారీ కూలీలపై దూసుకువెళ్ళింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.