కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టుకు కేజ్రీవాల్

న్యూఢిల్లీ : తనను జుడిషియల్ కస్టడీకి పంపిస్తూ మెజిస్టీరియల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు జస్టిస్ బిడి అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ మృదుల్ తో కూడిన ధర్మాసనాన్ని అర్థించగా మంగళవారం ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది.బిజెపి మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో బెయిల్ కోసం వ్యక్తిగత బాండ్ సమర్పించనందుకు కేజ్రీవాల్‌ను జూన్ 6 వరకు తీహార్ జైలుకు జుడిషియల్ కస్టడీకి పంపుతూ మెజిస్ట్రేట్ గతవారం  ఉత్తర్వులు జారీ చేశారు.