హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడండి

hyderabad]
విశ్వ నగరంగా రాజధాని

జీహెచ్‌ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి):

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని కాపాడాలని, హైద రాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తర్వాతి రోజే ఆ దిశగా చర్యలు ప్రారం భించారు. మంగళవారం సచివాయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన జీహెచ్‌ఎంసీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సీఎం ¬దాలో ఆయన తొలి సమీక్ష సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరిం చుకుంది. భాగ్యనగర సమస్యలు, పరిస్థితులపై జీహెచ్‌ ఎంసీ అధికారులను అడిగి తెలుసుకునాక్నరు. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, ట్రాఫిక్‌, శాంతిభద్రతలు, ఇతర మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చిం చారు. ముఖ్యంగా వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వారితో ప్రస్తావించారు. మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యుత్‌, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని, ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. హైద రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా ప్రణాళిక రూ పొందించాలన్నారు. ఇందుకు స్వల్ప, దీర్ఘకా లిక ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. జలమండలి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, తాగు నీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఐటీఐఆర్‌తో దాదాపు 40 లక్షల మంది నగరానికి వస్తారని, దానికి అనుగుణంగా మౌలిక వస తులు కల్పించాలని చెప్పారు. ఐటీ, ఫార్మ పరిశ్రమలకు ప్రోత్సహకాలు అందజేస్తామన్న కేసీఆర్‌ ఆ మేరకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. శాంతిభద్రతల విష యంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ఇటీవల
రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘర్షణలు, పోలీసు కాల్పులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. పాతబస్తీ సహా నగరవ్యాప్తంగా ఎక్కడా ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీిఎం మహ్మూద్‌ అలీ, ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రసాద్‌కుమార్‌ నీరభ్‌, పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, జలమండలి, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.