పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయండి
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించండి
తెలంగాణాకు ప్రత్యేక హోదా ఇవ్వండి శ్రీకొత్త రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయండి
ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాష్ట్రపతితో భేటీ అయిన కేసీఆర్
న్యూఢిల్లీ, జూన్ 7 (జనంసాక్షి) :
ఖమ్మం జిల్లాలోని అమాయక ఆదివాసీలను ముంచేసే పోలవరం ముంపు గ్రామాల విలీనం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధా నమంత్రి నరేంద్రమోడీని కోరారు. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. వీరి భేటీ 45 నిమిషాల పాటు సాగింది. ఈ సమా వేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలను కేసీఆర్ స్వయం గా మోడీకి పరిచయం చేశారు. అనంతరం ఎం పీలతో కలిసి తెలంగాణకు ప్రత్యేక ¬దా, ప్యాకేజీని కల్పించాలని మోడీని కోరారు. అదే విధంగా ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ¬దా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ప్రధానికి నివే దికను అందజేశారు. పోలవరం ముంపు మండ లాలను తెలంగాణలోనే కొనసాగించాలని టీఆర్ ఎస్ ఎంపీల బృందం ప్రధానికి విజ్ఞిప్తి చేసింది. అలాగే వివిధ అంవాలపై కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణకు ఇతోధిక చేయూత ఇవ్వాలన్నారు. దాదాపు 14 అంశాలపై ప్రధానికి ఓ మెమో రాండం సమర్పించారు. పోలవరం ఆర్డినెన్స్ రద్దు, తెలంగాణకు ప్రత్యేక ¬దాతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం సుహృ ద్భావ వాతావరణంలో సాగిందని అనంతరం మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలి పారు. కెసిఆర్ ఆదివారం వివరాలను వెల్లడి స్తారని అన్నారు. తొలి తెలంగాణ అసెంబ్లీ సమావేవాలు జరగుతున్న తరుణంలో ఢిల్లీలో పెద్దలను కలవాలని నిర్ణయించి వచ్చారన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రెండురోజుల పర్యటన నిమి త్తం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీ రావ డం ఇదే ప్రథమం. ఆయన ఇక్కడ మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీని కలవడానికి వచ్చారు. పనిలో పనిగా పలు అంశాలపై నివేదన ఇచ్చేం దుకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయంతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందిం చాల్సిందిగా ఆయన ప్రధానిని కోరారు. ము ఖ్యంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలు స్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఎనిమిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిందని, తెలం గాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది కాబట్టి కేంద్రం నుంచి ఆర్థికసాయం అందించాల్సిం దిగా ప్రధానితో విన్నవించినట్లు సమాచారం. చట్టంలో పేర్కొన్న మేరకు గిరిజన విశ్వవిద్యాల యాన్ని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని, ఖమ్మం జిల్లాలో ఇనుము-ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున వీటి గురించి కూడా ఆయన ప్రధానితో మాట్లాడినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో కలుపుతూ మోడీ ప్రభుత్వం గత నెల 28వ తేదీన ఆర్డినె న్సును జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మండ లాలను తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం ద్వారా ముంపు ప్రాంతాల విస్తృతిని తగ్గించవచ్చునని కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు
విషయంలో పలువురు సాగునీటి పారుదల నిపుణులు, ఇంజినీర్ల సూచనలను నివేదిక రూపంలో అందజేసారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి తలెత్తనున్న విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఖమ్మం జిల్లాలో నెలకొల్పే విషయమై ప్రధానితో చర్చించారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో భాగంగా 450 మెగావాట్ల సామర్థ్యమున్న దిగువ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కలువనున్నందున ఆ మేరకు విద్యుత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా తెలియజేసారు. ప్రధానితో శనివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన రైల్వే ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం అంశాలకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతోపాటు కొత్తగా ప్రమాణం చేసిన లోక్‌సభ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున నియమితులైన ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కేసీఆర్‌తో విడిగా సమావేశమయ్యారు. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నంకల్లా హైద రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఆదివారానికే ఢిల్లీ నుంచి బయల్దేరుతారు.