పోలవరం ఆపాల్సిందే
నాలుగు రాష్ట్రాల ముంపు ముచ్చట
రైతు రుణమాఫీకి కట్టుబడ్డాం
సీమాంధ్ర మీడియా చిలువలు పలువలేంది?
మేనిఫెస్టో హామీలకు కట్టుబడ్డాం
తెలంగాణ రాష్ట్రానికి మోడీ సహకరిస్తామన్నారు
ఢిల్లీ పర్యటన సక్సెస్ : సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ, జూన్ 8 (జనంసాక్షి) :లక్షలాది మంది గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతం ఉన్నందున నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వ హించిన తర్వాత పోలవరంపై తదుపరి చర్యలు చేపట్టాలని తాను ప్రధాని నరేంద్రమోడీని కోరినట్లు ఆయన వెల్లడించారు. గోదావరి నది నుంచి ఆంద్ర óప్రదేశ్‌కు నీళ్లు తీసుకెళ్లడానికి తాము వ్యతిరేకం కాదని, అత్యధిక ముంపు నకు కారణమవుతున్న ప్రస్తుత డిజైన్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రమే వ్యతిరే కిస్తున్నామని చెప్పామన్నారు. పోలవరం ఆర్డినెన్స్ విషయంలో కొందరు ప్రధానిని తప్పుదోవ పట్టించిన విషయం మోడీకి వివరించామన్నారు. నిర్మా ణాత్మకంగా ముందుకు వెళ్లే సమయంలో వెకిలి చేష్టలతో అభివృద్ధిని అడ్డు కోవద్దని కేసీఆర్ ప్రతిపక్షాల పార్టీలకు సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటన ఫలప్రదమైందని చెప్పుకొ చ్చారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తుందని రుణ మాఫీకి టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంపై ఓ మంత్రి తెలిసో తెలియకో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మీడియా నానా యాగీ చేస్తున్నాయన్నారు. విపక్షాలు తొందరపడొద్దని సూచించారు. తెలంగా ణలో అధికారుల కొరత ఉందని, తన కార్యాలయంలోనే అధికారులు లేర న్నారు. కేవలం రైతు రుణాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అడిగా మని, మరో పది, 15 రోజుల్లో లక్షలోపు రుణాలను మాఫీ చేసే విషయమై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఆంధ్రప్రాంత ప్రజలకు నీరు వెళ్లడాన్ని తాము వ్యతిరేకించడంలేదని, డిజైన్ మార్చడం ద్వారా ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజనులను కష్టాల పాలు చేయవ ద్దని మాత్రమే తాను కోరానని అన్నారు. స్నేహపూర్వ
వాతావరణంలో సమస్య పరిష్కారం కావాలని, ఇందుకోసం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశ పరిచి సమస్యను పరిష్కరించాలని కోరామన్నారు. పోలవరం డిజైన్ మార్చకుండా కడితే నాలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోయేది గిరిజనులేనని అన్నారు. అలాగే నిర్మిస్తే పాపికొండలు వంటి పర్యాటక కేంద్రాలు కనుమరుగు అవుతాయని, అన్ని విషయాలను గమనించి నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరామన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నట్టు కూడా ప్రధానికి చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై ఏడు నిమిషాల పాటు చర్చించినట్టు ఆయన చెప్పారు. పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కూడా స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకు, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో ఉండాల్సిందేనని ప్రధానిని కోరినట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. బిల్లులో పొందుపరిచిన మాదిరిగా హామీలన్నీ నెరవేర్చాలని కోరినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేస్తున్నందునా, చంద్రబాబుకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రభుత్వానికి తమ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి పక్షపాతం చూపబోమని, ముఖ్యమంత్రిగా తన అనుభవం మేరకు రాష్ట్రాలకు అధికారాలు ఉండాల్సిందేనని మోడీ అన్నారన్నారు. పాతిక సంవత్సరాల అభివృద్ధి ఐదేళ్లలో జరిగేలా కృషి చేస్తామన్నారు. మోడీ ఇచ్చిన హామీలపట్ల కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రితో మాట్లాడిన సందర్భంలో ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారని తనకు పూర్తి నమ్మకం కలిగిందన్నారు. రాష్ట్రపతికి సైతం తనను అభినందించారని, పెట్టుబడుల కోసం హైదరాబాద్‌లో త్వరలో జరిగే మేయర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని రాష్ట్రపతిని కోరినట్టు కేసీఆర్ వెల్లడించారు. 164 దేశాల మేయర్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. తన ఆహ్వానాన్ని రాష్ట్రపతి అంగీకరించినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిజాం కట్టించిన భవంతులు అన్నీ తెలంగాణ హక్కేనని వాటిని పంచేందుకు వీలు లేదని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు జితెందర్‌రెడ్డి, కేకేలతో పాటు పలువురు పాల్గొన్నారు.