బియాస్‌ నదీ తీరం జల్లెడ

mandi_rover20140609.jpg.ash

రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు
ఐదుగురి మృతదేహాలు లభ్యం

మిగిలిన వారి కోసం గాలింపు
వెంటనే స్పందించిన కేసీఆర్‌

హిమాచల్‌ సీఎంకు ఫోన్‌
సహాయక చర్యలు చేపట్టాలని కోరిన ముఖ్యమంత్రి
ఘటన స్థలాన్ని సందర్శించిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం
న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) : బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొ నసాగుతున్నాయి. నదీ తీరాన్ని జల్లెడ పట్టి గల్లం తయిన విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయ త్నిస్తున్నారు. విజ్ఞాన యాత్రకు వెళ్లిన 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతు కాగా.. ఇప్పటివరకూ ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎస్‌ ఎస్‌బీ, ఎన్డీఆర్‌ఎస్‌ బృందాలు నదిని జల్లెడ పడు తున్నాయి. గత ఈతగాళ్లు,
పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు పాలుపంచుకుంటున్నారు. హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, కేంద్ర మంత్రి స్మృతిఇరానీ, తెలంగాణ ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. తాజాగా సైన్యం కూడా రంగంలోకి దిగింది. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో యుద్ధ విమానాలతో గాలింపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు, సురక్షితంగా బయటపడిన వారిని మండీ నుంచి చండీగడ్‌, ఢిల్లీ విూదుగా స్వస్థలానికి బయల్దేరారు. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఆకుల విజేత, లక్ష్మీగాయత్రి, నల్లగొండ జిల్లాకు చెందిన బానోతు రాంబాబు, సికింద్రాబాద్‌కు చెందిన గంపల ఐశ్వర్యలను గుర్తించారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. యుద్ధ విమానంలో నేరుగా హైదరాబాద్‌ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో విద్యార్థులు గల్లంతయిన ఘటనపై సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. ఆయన డీజీపీ అనురాగ్‌శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను తెలుసుకుని చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మృతదేహాలను, సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘటనపై స్వయంగా పరిశీలించేందుకు ¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇప్పటికే కులూ చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే హిమాచల్‌ప్రదేశ్‌లో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతైన బియాస్‌ నదీ తీరంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ పర్యటించారు. విద్యార్థుల ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. హిమాచల్‌ప్రదేశ్‌ బియాస్‌ నదిలో గల్లంతి మృత్యువాత పడిన నలుగురు విద్యార్థుల మృతదేహాలకు కులూమనాలిలో శవ పరీక్షలు పూర్తయ్యాయి. మృతదేహాలను ప్రత్యేక హెలిక్టాపర్‌లో చండీగఢ్‌ తరలిస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో పక్క గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ వద్ద ఉన్న విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు 24 మందిని, ఓ అధ్యాపకుణ్ని అక్కడి యంత్రాంగం కులూమనాలికి తరలిస్తోంది. రెండు చిన్న విమానాల్లో వారిని కులూమనాలినుంచి చండీగఢ్‌ తరలిస్తారు. చండీగఢ్‌నుంచి అందర్నీ ఒకే విమానంలో హైదరాబాద్‌ తరలించాలని నిర్ణయించారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనపై బాలల హుక్కుల సంఘం హెచ్చార్సీలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హెచ్చార్సీ స్పందిస్తూ ఈ ఘటనపై ఆగస్టు 14 లోపు సమాచారం ఇవ్వాలని సీఎస్‌, సైబరాబాద్‌ సీపీకి ఆదేశాలు జారీ చేసింది.
కులూ చేరుకున్న మంత్రి నాయిని
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో 24 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతైన ప్రదేశాన్ని తెలంగాణ ¬మంత్రి నాయిని నరసింహారెడ్డి పరిశీలించారు. హైదారబాద్‌ నుంచి ఆయన మధ్యాహ్నం కులూ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో దొరికిన డెడ్‌ బాడీలను హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలిని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి సమాచారం లేకుండా గేట్లు ఎత్తివేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని హిమాచల్‌ సీఎం వీరభద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ఈ ఘటన పూర్తిగా నిరల్‌క్ష్యం కారణంగా జరిగిందన్నారు. ¬ంమంత్రితో పాటు గ్రేహౌండ్స్‌ ఎస్పీ కార్తికేయ, బాలానగర్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో జరుగుతున్న గాలింపు వివరాలకు అక్కడి అడిషన్‌ డీజీ, డీజీపీ, మండి, కులూ జిల్లాల ఎస్పీలు ¬ంమంత్రికి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తామని అధికారులకు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలావుంటే కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు గల్లంతైన బియాస్‌ నదీ ప్రాంతాన్నిఆయన పరిశీలించనున్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు హామీ ఇచ్చారు. అన్ని సహాయకచర్యలు తీసుకుంటామని అన్నారు.
సహాయక చర్యలను పర్యవేక్షించిన స్మృతి ఇరానీ
హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్‌ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనలో ఇప్పటివరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇక్కడ సహాయకచర్యలను, గాలింపును ఆమె పర్యవేక్షించారు. ఇతర విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యాన్నిచెప్పారు. గల్లంతైన మరో 19 మంది కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలానికి 20 కిలోమీటర్ల దిగువన మృతదేహాలు లభ్యమయినట్టు వెల్లడించారు. విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ఇరానీ చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ విద్యామంత్రి బాలి, విజ్ఞానజ్యోతి కళాశాల ప్రినిపాల్‌ తో మాట్లాడినట్టు వెల్లడించారు. అవసరమైన సాయం అందిస్తామని చెప్పినట్టు తెలిపారు. గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ వద్ద ఉన్న విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు 24 మందిని, ఓ అధ్యాపకుణ్ని అక్కడి యంత్రాంగం కులూమనాలికి తరలిస్తోంది. రెండు చిన్న విమానాల్లో వారిని కులూమనాలినుంచి చండీగఢ్‌ తరలిస్తారు. చండీగఢ్‌నుంచి అందర్నీ ఒకే విమానంలో హైదరాబాద్‌ తరలించాలని నిర్ణయించారు. ఇదిలావుంటే వీరిలో 25 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరితోపాటు ముగ్గురు ఫ్యాకల్టీలు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. సురక్షితంగా ఉన్న విద్యార్థుల వివరాలు దీప్తి, చేతన్‌, నితిన్‌, రాకేశ్‌, బిశ్వాస్‌, అచ్యుత్‌, ప్రభాత్‌, రఘువంశీ, శ్రీకాంత్‌, ప్రత్యూష, మౌనిక, దివ్య, నవ్య, సజన్‌, నమన్‌తేజ, రాకేశ్‌, సువర్ష, లావణ్య, విజయ, పూర్ణ శేఖర్‌, మోహన్‌, రుషిక, అవీష్‌, అత్యూష్‌, రాఘవేంద్ర ఉన్నారు. ఈ ఘటన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థులు సురక్షితంగా బయటకు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆమె తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హిమాచల్‌ సీఎం వీరభద్ర సింగ్‌ను సోనియా ఆదేశించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కళాశాలలో విషాదకర వాతావరణం
హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృతి చెందడంతో బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాలలో విషాదకర ఛాయలు నెలకొన్నాయి. బంధువుల రోదనలు, ఆందోళనలతో మిన్నంటిన కాలేజీలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. తమ సహచరుల మృతిని తోటి విద్యార్థుల జీర్ణించుకోలేక పోతున్నారు. కళ్లెదుట సంతోషంగా విజ్ఞాన యాత్రకు బయలుదేరిన తమ స్నేహితులు మృత్యువాత పడడంతో తల్లడిల్లిపోతున్నారు. ఊహించని ఉత్పాతం తమ వారిని బలిగొనడంపై కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం పరీక్షలు అయిపోతే, ఆదివారమే హడావుడిగా విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారని యాజమాన్యం తీరును విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పుబట్టారు.
రెండు బృందాలుగా యాత్రకు..
రెండు బృందాలుగా విద్యార్థులు యాత్రకు తరలివెళ్లడం ఒక విధంగా మంచిదైంది. వాస్తవానికి ఈఐఈ, సీఎస్‌ఈ విద్యార్తులు అంతా కలిసే విజ్ఞాన యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో అలా వెల్లకపోవడం మంచిదైందని, లేకుంటే ఊహించని రీతిలో ప్రాణనష్టం జరిగేదని అధికారులు చెబుతున్నారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి కాలేజీకి చెందిన ఈఐఈ, సీఎస్‌ఈ విద్యార్థులు విజ్ఞాన యాత్రకు బయల్దేరి వెళ్లారు. అయితే, వారు రెండు బృందాలుగా బయల్దేరారు. ముందుగా బయల్దేరిన ఈఐఈ విభాగం విద్యార్థులు లర్జీ హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి బియాస్‌ నదిలో ఫొటోలు దిగుతుండగా.. ఉద్ధృతంగా వచ్చిన వరదలో వారంతా కొట్టుకుపోయారు. అయితే, వీరితో పాటే వెళ్లాల్సిన సీఎస్‌ఈ విభాగానికి 77 మంది విద్యార్థులు మాత్రం కాస్త ఆలస్యంగా బయల్దేరారు. ప్రమాద విషయం తెలియడంతో వారు ఢిల్లీలోనే ఉండిపోయారు.
బాధ్యత మాదే : యాజమాన్యం
తమ కళాశాల నుంచి విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు కావడం దురదృష్టకరమని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం పేర్కొంది. సంఘటనపై కాలేజీ యాజమాన్యం ప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తాము బాధ్యత వహిస్తున్నామని కాలేజీ చైర్మన్‌ రోదిస్తూ చెప్పారు. తల్లిదండ్రులకు తమ సంతాపం తెలిపారు. గల్లంతుపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తక్షణమే సమాచారం ఇచ్చామని, కళాశాల నుంచి ఐదుగురిని ఘటనా స్థలానికి పంపించామన్నారు. హిమాచల్‌ప్రాదేశ్‌ ముఖ్యమంత్రి తమతో మాట్లాడారని, రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసిన వారిని సస్పెండ్‌ చేసినట్లు చెప్పారన్నారు. ఈ దుర్ఘటనలో మరెవరి ప్రమేయమూ లేదని తెలిపారు. నది పక్కన ఉన్న దేవాలయం చూడడానికి విద్యార్థులు వెళ్లారని, యువతరంలో ఉండే సహజమైన కుతహలంలోనే వారు ప్రవర్తించారని చెప్పారు. అంతకు మించి తమ విద్యార్థులు చేసిన తప్పేవిూ లేదని వారు ఆవేదనతో తెలిపారు.
నేతల దిగ్భ్రాంతి
మరోవైపు ఈ ఘోర దుర్ఘటనపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో విచారం వ్యక్తమైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతి ఇరానీ, అశోక్‌గజపతిరాజు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా ప్రమాద స్థలానికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బియాస్‌ నదిలో కొట్టుకుపోయిన ఘటనలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని ఆమె చెప్పారు. మరో 19 మంది కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ఘటనా స్థలానికి 20 కిలోవిూటర్ల దిగువన మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. సహాయక చర్యలకకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అశోక్‌గజపతిరాజు కూడా ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు ప్రమాదంపై దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు, ప్రమాద ఘటనపై ఉదయం నుంచే జాతీయ చానెళ్లు విస్తృతంగా వార్తలు ప్రసారం చేశాయి.
కొనసాగుతున్న సహాయక చర్యలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ప్రమాద సమాచారం తెలియగానే కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. 84 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సోమవారం ఉదయమే గాలింపు చర్యలు చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సురక్షితంగా బయటపడిన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు, మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం ఉదయమే ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట అధికారులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షించారు. మరోవైపు, విద్యార్థుల తల్లిదండ్రులను హిమాచల్‌ప్రదేశ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. విమానం ద్వారా ఢిల్లీ విూదుగా వారిని ఘటనా స్థలానికి చేరవేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌లలో కంట్రోల్‌ రూంలు (040-2320 2813, 94409 15887) ఏర్పాటు చేసింది. అలాగే, ఢిల్లీలోని ఏపీభవన్‌లోనూ రెండు హైల్ప్‌లైన్‌ కేంద్రాలు (98719 99055, 98719 90081) ఏర్పాటు చేశారు. మరోవైపు ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను తరలించారు. మంత్రి నారాయణ ఘటనా స్థలానికి తరలివెళ్లారు. మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకొంది. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ స్వయంగా ప్రమాద స్థలికి వచ్చి సహాయక్య చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రభుత్వ అధికారులు సహకరించారు. ప్రమాదానికి కారణమైన ప్రాజెక్టు అధికారులను సస్పెండ్‌ చేశారు. తీవ్ర నిర్లక్ష్యం వహించిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతి ఇరానీ ఘటనపై తీవ్రదిగ్భాంతి వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున అన్ని విధాలుగా సహకారం అందజేస్తామన్నారు. ప్రమాద కారణాలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. గల్లంతైన వారంతా క్షేమంగా తిరిగి రావాలని స్మృతి ఇరానీ ఆకాంక్షించారు. విజ్ఞానజ్యోతి కళాశాల ప్రిన్సిపాల్‌, విద్యార్థులతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రమాదంపై హిమాచల్‌ ప్రభుత్వంతోనూ మాట్లాడామని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించామని ఆమె చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.