ఎవరెస్టు వీరులను అభినందించిన సీఎం

EVAREST
తెలంగాణ ఖ్యాతిని చాటారు
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి : కేసీఆర్‌రి
హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) :
చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించి ప్రపంచ రికార్డు సృష్టించిన తెలంగాణ వీరులు మలావత్‌ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కు మార్‌లను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. సోమ వారం రాష్ట్ర సచివాలయంలోని సీ బ్లాక్‌లో విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ముఖ్యమం త్రిని కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారిని ఘనంగా సత్కరించారు. పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు ఎవరెస్టు లాంటి ఉన్నత శిఖ రాన్ని అధిరోహించడం సాధారణ విషయం కాదన్నారు. తెలంగాణ దళిత, గిరిజన బిడ్డలు ఈ రాష్ట్ర ఖ్యాతిని ఎవరెస్టు శిఖరంపై చాటిచె ప్పారని కొనియాడారు. ప్రభుత్వ విద్యాసంస్థలు తలచుకుంటే ఎంత మంచి ఫలితాలు సాధిం చవచ్చో రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు చేసి చూపించారని
అన్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను సీఎం అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాలయాలంటేనే గురుకుల విద్యాసంస్థ అన్నంతగా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పూర్ణ తల్లిదండ్రులు మలావత్‌ దేవిదాస్‌, లక్ష్మీ, ఆనంద్‌కుమార్‌ తల్లిదండ్రులు కొండల్‌రావు, లక్ష్మి, శిక్షకుడు శేఖర్‌బాబు గురుకుల విద్యాసంస్థలకు చెందిన అధికారులు తదితరులు ఉన్నారు.