ఓ అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది

kcr
ఉద్యమకారులే
సభ నడుపుతున్నారు
ఇదో అద్భుత చరిత్ర
కేసీఆర్‌ ఉద్వేగ ప్రసంగం
తెలంగాణ
తొలి స్పీకర్‌గా మధుసూదనాచారి
అభినందించిన
కేసీఆర్‌, జానా తదితరులు
హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) :
ఉద్యమకారులే ప్రభుత్వాధి నేతలుగా తెలంగాణ ప్రభు త్వాన్ని నడుపుతున్న అద్భుతమైన చారిత్రక సన్నివేశం ఇదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి సీఎం కేసీఆర్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. తెలంగాణ చరిత్రలో ఇది చారిత్రక ఘట్టం. పట్టుదలకు మారుపేరు మధు సూదనాచారి. తెలంగాణ ఉద్యమంలో చారి సేవలు మరువలేనివి. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసుకుని సభ కొలువుదీరింది. ఇదే సభలో తెలంగాణ అన్న పదం నిషేధించిన సంఘటన నేను మర్చిపోలేను. అది ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా సభ కొనసా గాలని కెసిఆర్‌ ఆకాంక్షించారు. ఈ సభను చూస్తుంటే నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయన్నారు. అసెంబ్లీలో సభ్యులంతా తెలంగాణ సభ్యుడినైన నేను అంటూ ప్రమాణం చేసిన సందర్భంలో నా కళ్లు ఆనంద భాష్పాలు రాల్చాయన్నారు. తెలంగాణ పదం ఉచ్చరిం చరాదంటూ ఆనాడు స్వర్గీయ ప్రణయ్‌ భాస్కర్‌ ను నిరో ధించిన ఈ సభలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సభ సాగడం చారిత్రక ఘట్టం అన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమ కారులే సభను నడపడం సంతోషంగా ఉం ది. దేశంలోనే తెలంగాణ శాసనసభకు గొ ప్ప పేరు తేవాలని అన్నారు. ప్రజా సమస్య లే ఎజెండగా సభ సాగాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సభసాగాలని అభిల షించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో మధుసూదనాచారి పాత్ర మరువలేనిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారిని కేసీఆర్‌ అభినందించా రు. తెరాస అవిర్భావం ముందు నుంచే మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమంలో మమేకమ య్యారన్నారు. ఏ అస్తిత్వాన్ని ఉనికిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో అది సాకారమైందన్నారు. సభా నిర్వ హణలో సంపూర్ణ సహకారం అందిస్తామని సభానాయ కుడిగా హామీ ఇచ్చారు. స్పీకర్‌ ఎంపికలో పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికకు సమకరించిన రాజకీయ పార్టీలకు కెసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఓ మంచి సంప్రదాయాన్ని కొనసాగించారని అన్నారు.
అందరికీ సమానవకాశాలు: మధుసూదనాచారి
శాసనసభలో అందరి గొంతుక వినిపించేందుకు సహకరిస్తానని నూతన స్పీకర్‌ సిరికొండ మధు సూదనాచారి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాని కి సభలో సమగ్ర చర్చ జరిగేలా చూస్తానని హావిూ ఇచ్చారు. తన విధినిర్వహణలో రాజకీయాలకు, రాగద్వే షాలకు అతీతంగా వ్యవహరిస్తానని చెప్పారు. సభ్యులం దరినీ సమదృష్టితో చూస్తానని.. సభాసంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన ఆయన సభలో ప్రసంగించారు. సభ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతా మన్నా రు. సభ సజావుగా నిర్వహించేందుకు అందరూ సహక రించాలని కోరారు. అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడదామని సూచించారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన సభకు శిరస్సు వహించి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. మహాత్తరమైన ఘట్టం సందర్భంగా తన కళ్లు చెమరుస్తున్నాయని తొలి స్పీకర్‌గా అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోభివృద్ధి దిశలో పయానించాల్సిన అవసరం ఉందన్న సభాపతి అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు సభ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తరుణంలో తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు నమ్మకంతో ఉన్నారని వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా సభ్యులందరూ వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మన రాష్ట్ర శాసనసభ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. అత్యున్నత విలువలకు, ఉన్నత ప్రమాణాలకు ఈ సభ వేదికై రాబోయే తరాలకు ఆదర్శవంతం కావాలని కోరారు. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ రెండో రోజు సమావేశమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ జానారెడ్డి స్పీకర్‌గా మధుసూదనాచారి ఎన్నికైనట్లు లాంఛనంగా ప్రకటించారు. ఆయనకు అన్ని పార్టీల మద్దతు తెలిపాయని, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు మధుసూదనాచారి సీటు వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఆయనను సభాపతి స్థానానికి సవినయంగా తీసుకెళ్లారు. ఆయనను అభినందించిన జానారెడ్డి బాధ్యతలు అప్పగించారు. స్పీకర్‌గా ఎన్నికైన మధుసూదనాచారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.
చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్‌
తెలంగాణ చరిత్రలో ఇదో చారిత్రక ఘట్టం ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పట్టుదలకు మారు పేరు మధుసూదనాచారి అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన తన వెన్నంటే నడిచారని గుర్తు చేసుకున్నారు. 60 సుదీర్ఘ కలను నెరవేర్చుకొని ఈ సభ కొలువుదీరిందని, ఈ సభను చూస్తుంటే నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులే ఈ సభను నడుపుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు సహకరించిన అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. మధుసూదనాచారి తెలంగాణ అసెంబ్లీలో గొప్ప స్పీకర్‌గా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా సభ నడవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ స్పీకర్‌గా ఎన్నికైన మధుసూదనాచారికి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో త్యాగాల పునాదుల విూద తెలంగాణ సాధించుకున్నామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య అన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా బడుగు బలహీనవర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో సభాపతిగా ఎన్నికైన స్పీకర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మధుసూదనాచారి విధేయతకు మారుపేరని కొనియాడారు.
నిష్పక్షికంగా వ్యవహరించాలి : జానా
ప్రజా సమస్యలను ఈ వేదిక నుంచి పరిష్కరించేందుకు సభాపతి అందరివాడిగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి కోరారు. విధి నిర్వహణలో ఈ పక్షం, ఆ పక్షం అన్న వివక్ష చూపించొద్దని సూచించారు. వాస్తవాలను వెలికితీసేందుకు సమాజానికి నూతన నిర్దేశం చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సమస్యలపై కోపం ఉండాలి సమస్యల పరిష్కారంపై ఆవేశం ఉండాలన్నారు. దేశంలో పలు అసెంబ్లీల్లో జరుగుతున్న పరిస్థితులను గుర్తు చేసిన జానా అధికార దర్పంతో అహంకారంతో ఆవేశకావేశాలకు లోనుకావొద్దని, అలాంటి పరిస్థితులు మన దగ్గర ఉత్పన్నం కాకూడదన్నారు. సంప్రదాయాలను పాటించి ముందుకెళ్లాలని కోరారు. తొలి రాష్ట్రంలోని తొలి సభ దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభలకు భిన్నంగా గౌరవప్రదమైన రీతిలో సభను నిర్వహించుకుందామని సూచించారు. స్పీకర్‌గా చారిత్రక పాత్ర పోషించాలని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క సూచించారు. సభా సంప్రదాయాలను పాటిస్తూ అందరికీ అవకాశం కల్పించాలని, అన్ని పార్టీలను సమదృష్టితో చూడాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి కోరారు.
ఒత్తిళ్లకు లొంగొద్దు : ఎర్రబెల్లి
తొలి సభాపతిగా చరిత్రలో నిలిచిపోవాలని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఎర్రబెల్లి తమకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. పట్టుదలతో, విశ్వాసంతో పని చేసే సభాపతిగా ఎవరి ఒత్తిళ్లలకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ప్రతిపక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సభను సజావుగా నడిపించాలని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ కోరారు. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తి చర్చించి, పరిష్కరించేందుకు అందరికీ అవకాశం కల్పించాలని ఆయన కోరారు. స్పీకర్‌గా ఎన్నికైన మధుసూదనాచారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన విూరు మంచి సభాపతిగా చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
అందరికీ అవకాశమివ్వాలి : కిషన్‌రెడ్డి
పాలక, ప్రతిపక్షాలను సమన్వయం చేసుకుంటూ సభను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. గతంలో ఏ అధికార పార్టీ కూడా తమ అభిప్రాయాలను స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కిషన్‌రెడ్డి.. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రజా జీవనంలో రాజకీయ, సామాజిక అనుభవం ఉన్న విూరు సభను సజావుగా నడిపిస్తారన్న నమ్మకం ఉందని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలను, అందరూ ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని కోరారు. తెలంగణ తొలి స్పీకర్‌గా ఎన్నికైన మధుసూదనాచారికి బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్‌ కె.లక్ష్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలను హక్కులను కాపాడేలా స్పీకర్‌ వ్యవహరించాలని కోరారు. శాసనసభ గౌరవం తగ్గిపోతున్న తరుణంలో సభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.సభలో అందరికీ అభిప్రాయాలు తెలిపే హక్కు ఇవ్వాలని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కోరారు. సభను నడపడంలో ఎంఐఎం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. మధుసూదనాచారికి వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య అభినందనలు తెలిపారు. సభాపతి నిష్పక్షిపాతంగా వ్యవహరించాలని, శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని విన్నవించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పీకర్‌ చొరవ చూపాలని బీఎస్పీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు.