ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా బుర్రా వెంకటేశం

share on facebook

123
హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి) :
తెలంగాణ సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా కిశోర్‌ను నియమించింది. 1995 బ్యాక్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన వెంకటేశం తొలి తెలంగాణ ప్రభుత్వానికి కళ్లూచెవుల లాంటి సమాచారం పౌరసంబంధాల శాఖ నిర్వహణ బాధ్యతలకు ఎంపికయ్యారు. 1968 ఏప్రిల్‌ 10న జన్మించిన వెంకటేశం ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2011లోనూ ఆయన ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా సేవలందించారు. ఆయన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా, స్టేట్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *