సర్వజన సంక్షేమమే మా లక్ష్యం
తెలంగాణ పౌరులందరికీ సమాన హోదా
12 శాతం మైనార్టీ, ట్రైబ్ రిజర్వేషన్లకు కట్టుబడ్డాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు,
అర్హులైన వారికి ఉద్యోగం
విశ్వనగరంగా హైదరాబాద్
రూ.10 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
హైదరాబాద్, జూన్ 11 (జనంసాక్షి) :సర్వజన సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తామని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలిపారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని రాబోయే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్నారు. తెలంగాణలో నివసించే ప్రతీ పౌరుడికి సమా న ¬దా కల్పిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు, కొత్త పారిశ్రామిక విధానం అమలు, ఫార్మా, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
బుధవారం తెలంగాణ శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. తన ప్రభుత్వ ప్రాధమ్యాలను, ఐదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, ఇంగ్లిష్‌లో కొనసాగించి తెలుగులో ముగించారు.
అమరుల కుటుంబాలకు వరాలు
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ ప్రజల కల సాకారమైందని.. వందలాది మంది యువకుల త్యాగా ల ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో అనేక మంది త్యాగాలు చేశారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం మరవబోమదని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుం టుందని చెప్పారు. త్యాగాల విూదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వారిని మరువబోమని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారం దరినీ ఆదుకుంటామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అలాగే, అర్హత కలిగిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అర్హత లేని వారికి వ్యవసాయ భూమి, ఇల్లు ఇప్పిస్తామన్నారు. అలాగే, అమరుల కుటుంబానికి ఉచిత విద్య, ఆరోగ్య వసతి కల్పిస్తామని తెలిపారు.
రాజకీయ అవినీతి అంతం
ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలంటే అవినీతి ఉండకూడదని గవర్నర్ తెలిపారు. తన ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోదన్నారు. ప్రధానంగా రాజకీయ అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర స్థాయి సలహా మండలి ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైల్వే శాఖను సంప్రదిస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని, పరిశ్రమలకు అనుమతుల కోసం సింగల్ విధానం తీసుకొస్తామ న్నారు.
సంక్షేమం కోసం వెయ్యి కోట్లు..
అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నరసింహన్ వెల్లడించారు. తెలంగాణలో లక్షల కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయని పేర్కొన్న గవర్నర్.. వారందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఇందులో ఒక్క ఎస్సీల సంక్షేమం కోసమే రూ.50 వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. వాల్మీకి, బోయలను ఎస్టీలో కలిపేందుకు కృషి చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్దికి తన ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు. తండాలు, గిరిజన గ్రామాలను పంచాయతీలుగా మారు స్తామని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామన్నారు. ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. బలహీన వర్గాల వారికి రూ.3 లక్షల వ్యయంతో పేదలకు రెండు పడక గదులు, హాల్, కిచెన్, బాత్రూం వసతితో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు, భూమి లేని వారికి భూమి ఇస్తామని తెలిపారు. వృద్ధులు, వితంతులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ అందిస్తా మన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 కోట్లతో
కార్పస్ ఫండ్ నిధిని ఏర్పాటు చేస్తామని, అలాగే న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని పునరుద్ఘాటించారు. అలాగే, హెల్త్‌కార్డులు అందజేస్తామన్నారు.
వ్యసాయానికి ప్రాధాన్యం
విద్యుత్, వ్యవసాయ రంగానికి తన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని నరసింహన్ తెలిపారు. ప్రతీ రైతుకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌కు జాతీయ ¬దా సాధిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో చెరుకు, మోతెలో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హావిూ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల కోసం సత్వర సర్వే చేపడతామన్నారు. తెలంగాణను విత్తన ధాన్యాగారంగా మారుస్తామన్నారు. తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్ను మినహాయింపునిస్తామన్నారు. ఎరువుల బ్లాక్‌మార్కెట్ నివారిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యనిస్తుందని చెప్పారు. రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ కొరత ఎదుర్కొంటున్నామని, ఎన్టీపీసీతో దాన్ని అధిగమిస్తామన్నారు. విద్యుత్ సమస్య నివారణకు రాబోయే మూడేళ్లలో చత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు. వరంగల్, సిరిసిల్లలో చేనేత పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేస్తామని తెలిపారు.
విశ్వనగరంగా హైదరాబాద్..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతామని, విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని గవర్నర్ తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నేరాల నియంత్రణకు సాంకేతికంగా అత్యున్నత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ద్వారా మురికివాడలు లేని హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణం, ర్యాపిడ్ మాస్‌ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఫార్మా, బయోటెక్ రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. దేశీయ విమానాశ్రయాలు నిర్మిస్తామని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మహిళా భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహిళలకు అత్యంత సురిక్షిత ప్రాంతంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో మహిళా సాధికారిత సాధించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తామన్నారు. 104, 108 సర్వీసుల పటిష్టతకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజారోగ్యాన్ని మరుగుపరుస్తామని తెలిపారు. రూ.10 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.