ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చెల్లదు
దేశ సరిహద్దు ప్రాంతాలు, రవాణా వీలుకాని ఎత్తయిన ప్రాంతాలు, ఆదివాసీలు
అధికంగా ఉన్న ప్రాంతాలు, జనసాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాలకు
మాత్రమే ప్రత్యేక హోదా
స్పష్టం చేసిన ప్రణాళికా సంఘం
జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన సూత్రాల్లోకి ఏపీ రాదు
ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఓకే
బీహార్, ఏపీలకు నో
హైదరాబాద్, జూన్ 13 (జనంసాక్షి) :
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక రాష్ట్ర ¬దాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రణాళిక సంఘం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇచ్చే అవకాశం లేదని ప్రణాళిక సంఘం తేల్చి చెప్పింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని, జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) నిర్దేశించిన సూత్రాల ప్రకారం ఆ రాష్ట్రం ప్రత్యేక ¬దా పొందలేదని స్పష్టం చేసింది. ప్రస్తుత మార్గనిర్దేశకాల ప్రకారం ఏపీకి ప్రత్యేక ¬దా, అదనపు సాయం చేయడానికి వీల్లేదని పేర్కొంది. శుక్రవారం ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జీత్‌సింగ్ రావుకు ప్రణాళిక సంఘం అధికారులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పునర్విభజన చట్టంతో పాటు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రత్యేక ¬దాపై దృష్టి సారించింది. అయితే, ఏపీకి ప్రత్యేక ¬దా సాధ్యం కాదని ప్లానింగ్ కమిషన్ స్పష్టం చేసింది. ఎన్‌డీసీ మార్గనిర్దేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా లభించదని మంత్రి ఇందర్‌జిత్‌సింగ్ రావుకు తెలిపింది. సీమాంధ్రకు ప్రత్యేక ¬దా కల్పించే అంశాన్ని పరిశీలించాలని మార్చి 2న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ ప్లానింగ్ కమిషన్‌కు సూచించింది. అంతకుముందు సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా కల్పిస్తామని ఫిబ్రవరి 21న రాజ్యసభలో మన్మోహన్ ప్రకటించారు. అయితే, ప్రణాళిక సంఘం తాజా ప్రెజెంటేషన్‌తో
నాటి హావిూ నీటి మూటగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటీవలే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రకు మొండిచేయే..
బీహార్, ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాలు తమకు ప్రత్యేక ¬దా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. విభజన తర్వాత ఈ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చేరింది. అయితే, బీహార్‌కు కూడా ప్రత్యేక ¬దా ఇచ్చే అవకాశం లేదని ప్రణాళిక సంఘం తెలిపింది. అయితే, బీహార్ డిమాండ్‌పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. మిగతా రాష్టాల్రకు మాత్రం ఆ ¬దా ఇవ్వవచ్చునని కమిషన్ తెలిపింది. నిర్ణీత మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాలకు ¬దా పొందే అర్హత ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రత్యేక ¬దా సాధ్యం కాదని కమిషన్ మంత్రికి స్పష్టం చేసింది. ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి రూపొందించిన మార్గదర్శకాల మేరకు ¬దా పొందేందుకు ఏపీకి అర్హత లేదని తెలిపింది. ప్రత్యేక ¬దా పొందిన రాష్ట్రానికి గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం 90 శాతం ప్రణాళికా గ్రాంట్‌గా, మిగతాది అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండడం, జనసాంద్రత తక్కువగా ఉండడం, పెద్ద సంఖ్యలో గిరిజన ఉండడం, ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక ¬దా ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కింలకు మాత్రమే స్పెషల్ కేటగిరీ ఉంది. ప్రణాళిక సంఘం తాజా నిర్ణయాన్ని కేంద్రం ఆమోదిస్తే రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కనుంది.