పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలి
రెండు రాష్ట్రాలకూ హైకోర్టు ఏర్పాటు
రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
8 తీర్మానాలకు సభ ఆమోదం
అమరులకు ఘన నివాళి
సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) :
ఆదివాసీలను ముంచే పోలవరం ముంపు గ్రామాల విలీనం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. తెలంగాణ శాసనసభ శనివారం నివధికంగా వాయిదా పడింది. ఆరు రోజుల పాటు సమావేశమైన సభ ఎలాంటి వాయిదాలు లేకుండా సజావుగా సాగడం విశేషం. శనివారం సమావేశమైన అసెంబ్లీ ఎనిమిది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభు త్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని శాసనసభ తీర్మానిం చింది. అలాగే, పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు రెండు రాష్టాల్రకు రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించింది. అలాగే, బలహీ నవర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు శనివారం అసెం బ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పలు తీర్మానాలు ప్రతిపాదిం చారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపె ట్టారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగా ణ రాష్ట్ర శాసనసభ ఆమోదం లేకుండా సరిహద్దులు మార్చడం సరికాదన్నా రు. డిజైన్ మార్చకుండా ప్రాజెక్టు కడితే తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు చెం దిన లక్షలాది మంది గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్య క్తం చేశారు. దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా తాము కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. అలాగే, పెద్ద ఎత్తున చేపడుతున్న ఇంద్రాసాగర్ ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏడు మం డలాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను శాసన సభ వ్యతిరేకిస్తున్నదని తక్షణమే ఆ ఆర్డినెన్స్‌ను ఉపసహించుకోవాలని తీర్మా నించారు. పిన్న వయస్సులో ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లను అభినందిస్తూ కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే, సింగరేణి కార్మికు లకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ మరో తీర్మానం ప్రతిపాదించారు. సైనికులకు ఇస్తున్న తరహాలో సింగరేణి కార్మికు లకు ఆదాయ పన్ను మినహాయించాలని కోరారు. అలాగే, హైకోర్టును సత్వ రమే విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ కేసీఆర్ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లును అమ లు చేయాలని కోరుతూ కేసీఆర్ మరో తీర్మానం ప్రతిపాదించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేవపెట్టారు. దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ వారి సంక్షే మానికి ఓ శాఖ లేకపోవడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎనిమిది తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
పోలవరంపై వాగ్వాదం..
పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ చేపట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. తొలుత టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తీర్మానాన్ని తాము బలపరుస్తున్నామని చెప్పారు. అయితే, కేసీఆర్ ఎంపీగా ఉండి ఆర్డినెన్స్‌ను ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ జోక్యం చేసుకుంటూ తాను ఎం పీగా ఉన్న సమయంలో ఆర్డినెన్స్ రాలేదని తెలిపారు. అనవసరంగా రాజ కీయం చేయొద్దని సూచించారు. దీనిపై సండ్ర ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ స్పష్ట మైన వైఖరి తెలపాలని కోరారు. అలాగే ఇతర ఆరోపణలు చేయగా శాసన సభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ తీవ్రంగా మండి పడ్డారు. పోలవరంపై టీఆర్‌ఎస్ మొదటి నుంచి ఒకటే విధానంతో ఉందని స్పష్టం చేశారు. పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులు కడుతున్నారని నిరసిస్తూ వైఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని ఇదే శాసనసభను 25-30 రోజులు అడ్డుకున్నది టీఆర్‌ఎస్సేనని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలని సుప్రీం కోర్టులో కేసు వేసింది తామేనన్నారు. పోలవరాన్ని అడ్డుకుంటున్నది తామే నని వైఎస్, చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం గుర్తు లేదా? అని ప్ర శ్నించారు. ఆర్డినెన్స్ రాకుండా చూడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం
ఆర్డినెన్స్ తీసుకొస్తుందని తెలియగానే ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారని చెప్పారు. ప్రధాని మోడీని కలిసిన సమయంలో పోలవరంపై గట్టిగా చెప్పారన్నారు. అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేయొద్దని కోరారు. కేంద్రం విూద ఒత్తిడి తేవాలనే ఉద్దేశ్యంతోనే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాజకీయాలు చేయొద్దని సూచించారు. అందరినీ కలుపుకొని పోవాలన్న ఉద్దేశ్యంతోనే తాము ఉన్నామని, నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. టీడీపీ వల్లే పోలవరంపై ఆర్డినెన్స్ వచ్చిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభకు కొద్దిసేపు అంతరాయం కలిగించారు. చివరకు వాద ప్రతివాదాల అనంతరం సభ పోలవరం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని ఏకగ్రీవంగా ఆమోదించింది.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే తరహాలోనే తమకు కూడా ప్రత్యేక ¬దా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు ప్రత్యేక ¬దా కల్పించేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శనివారం శాసనసభలో.. తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేసీఆర్ తీర్మానం ప్రతిపాదించారు. ప్రత్యేక ¬దాకు కావాల్సిన అర్హతలు తెలంగాణకు ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలను సమప్రాతిపదికన పరిగణించాలని కోరారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడినవేనని, అత్యల్ప జీవన ప్రమాణ స్థాయి తదితర అంశాల నేపథ్యంలో తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా కల్పించాల్సిందేనన్నారు. తాను ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక ¬దా అంశంపై మాట్లాడనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తున్న నేపథ్యంలో తమకు కూడా ఇవ్వాలని, కేంద్రం రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరానన్నారు. ఇందుకు స్పందించిన ప్రధాని మోడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని చెప్పారన్నారు. అందుకే తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిద్దామని కోరారు.ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలుపుతూనే.. కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ కేటగిరి, పన్నుల మినహాయింపు కల్పించి, తెలంగాణకు ఇవ్వకపోతే మనకు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. పన్నుల మినహాయింపు నేపథ్యంలో ఇక్కడి పరిశ్రమలు అక్కడికి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుంటూ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రత్యేక ¬దా కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలని ప్రధాని మోడీ సూచించారన్న కేసీఆర్.. తీర్మానం చేసి పంపిద్దామన్నారు.
బియాస్ మృతులకు సంతాపం
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థులకు శాసనసభ ఘనంగా నివాళులు అర్పించింది. ఇటీవల విజ్ఞానయాత్రకు వెళ్లిన వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతి చెందిన వారికి శనివారం శాసనసభ సంతాపం ప్రకటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సభలో కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. బియాస్ ఘటనపై ప్రకటన చేశారు. ఈ నెల 8న రాత్రి క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో ప్రమాద సమాచారం తెలిసిందని కేసీఆర్ చెప్పారు. వెంటనే స్పందించి ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతుపై రెస్క్యూ ఆపరేషన్ కోసం హిమాచల్‌ప్రదేశ్ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించామని తెలిపారు. కేంద్రంతో, హిమాచల్ ముఖ్యమంత్రి వీరభధ్రసింగ్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరించాలని కోరానన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర ¬ం, రక్షణ, నేవీ కార్యదర్శులతో మాట్లాడారని చెప్పారు. బాదితుల తల్లిదండ్రులను ప్రత్యేక విమానాల్లో ప్రమాద స్థలానికి తరలించామని తెలిపారు. వెలికితీసిన మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మృతదేహాల వెలికితీత కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ దగ్గరుండి సవిూక్షిస్తున్నారని చెప్పారు. తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ రాజీవ్ త్రివేది తన బృందంతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారన్నారు. మిగతా మృతదేహాలను కూడా వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మృతులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటిద్దామని ప్రతిపాదించారు. సభ్యులంతా మౌనం పాటించి సంతాపం తెలిపారు.
తెలంగాణ అమరులకు ఘన నివాళి
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మబలిదానాలు చేసిన అమరవీరులకు శాసనసభ ఘనంగా నివాళులు అర్పించింది. 1969లో అమరులైన 369 యువకులకు, మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన 1200 మంది విద్యార్థులకు సభ నివాళులు అర్పిస్తూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడతామని ప్రకటించింది. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పలువురు చేసిన ఆత్మబలిదానాలను ఆయన గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలను స్మరించుకుంటే ఇప్పటికీ తనకు కన్నీళ్లు వస్తాయన్నారు. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. స్వరాజ్య ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల అమరత్వం అజరామమని కొనియాడారు. ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణను కలిపిన 1956లోనే తెలంగాణ ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. 1969లో స్వరాష్ట్ర నినాదంతో ఉద్యమించిన తెలంగాణ బిడ్డలను అప్పటి ప్రభుత్వం పాశవికంగా కాల్చివేసిందని, 369 మంది తూటాలకు బలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మ¬న్నత వ్యక్తి అని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా మర్కాజీ కాలేజీలో తెలంగాణ భాషను కించపరుస్తూ అయ్యదేవర కాళేశ్వర ఇచ్చిన ఉపన్యాసాన్ని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. తెలంగాణ అస్తిత్వంపై ఆనాడే లాఠీచార్జి చేశారని, విద్యార్థుల బలిదానంతో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు. 1948-52 వరకు విద్యార్థుల ఉద్యమం జరిగిందని.. సిటీ కాలేజీ ఎదుట జరిగిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారన్నారు. సార్ తెలంగాణ కల సాకారమైన తరుణంలో లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ మరణం తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటన్నారు. తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలపడానని వ్యతిరేకించిన తొలి వ్యక్తి ఆయనేనని గుర్తు చేశారు. ఆయన విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడని వివరించారు. రావు సాబ్ అని తనను పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. సీమాంధ్రతో కలపడం వల్ల తెలంగాణ ప్రాంతం కుంగిపోయిందని, చాలా వెనుకబడిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు చూసి.. తాను 1969 ఉద్యమ సమయంలోనే మరణించి ఉంటే బాగుండేదని జయశంకర్ సార్ తనతో చెప్పేవారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల అణచివేతపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంతో ఆవేదన ఆవేదన చెందేవారన్నారు.
శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగిందని కేసీఆర్ తెలిపారు. శ్రీకాంతాచారి ఆత్మహత్య తనకు కంటతడి తెప్పించిందని చెప్పారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారితో మొదలైన బలిదానాల పర్వం దాదాపు 1500కు చేరిందని చెప్పారు. తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు, యువకులు ఎవరూ కూడా తాము చనిపోతున్న సమయంలో అమ్మా అయ్యా అని అరవలేదని.. జై తెలంగాణ అని నినదించారని కొనియాడారు. ప్రాణత్యాగానికి మించిన త్యాగముండదన్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో విద్యార్థులు, ప్రజల బలిదానాలు వృథా కాలేదన్నారు. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ప్రకటించారు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులు ప్రాణత్యాగం చేయగా, మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్తులు, యువకులు బలిదానాలు చేశారన్నారు. వారందరికీ శాంతి చేకూరాలని, సభ జోహర్లు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తోందని కేసీఆర్ తెలిపారు.
వైఎస్ వ్యతిరేకించారు : చిన్నారెడ్డి
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు బలపరుస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారుఉ. అమరుల త్యాగాలు మరువలేనివని, వెలకట్టలేనివన్న ఆయన అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కల్పించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని 2000 సంవత్సరంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాటి ప్రధాని వాజ్‌పేయి, ¬ం మంత్రి అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ ఇవ్వడంతోనే మలిదశ ఉద్యమానికి బీజం పడిందన్నారు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని తెలిపారు. టీఆర్‌ఎస్ స్థాపించి, 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. అయితే, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారని.. ఈ విషయాన్ని పలుమార్లు ఆయన తనతో స్వయంగా చెప్పారన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసేందుకు యత్నించినా వైఎస్ అడ్డుపడ్డాడని తెలిపారు. చివరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియాగాంధీ చొరవతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉందన్నారు.
అమరుల కుటుంబాలను ఆదుకోవాలి: టీడీపీ
అమరవీరుల సంతాప తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని, సమర్థిస్తున్నామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉప నేత రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానంపై ప్రసంగించారు. 1969లో ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్న రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత ఉద్యమానికి ఉస్మానియా వర్సిటీ వేదికగా మారిందన్నారు. అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడిందని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కూడా కల్పించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారిని సమరయోధులుగా గుర్తించి వారికి కూడా ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు. శ్రీకాంతాచారి మృతి చెందిన రోజును అమరవీరుల స్మారక దినంగా ప్రభుత్వం జరపాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలన్నారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసినా తాము సమర్థిస్తామని చెప్పారు. అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని ఎర్రబెల్లి కోరారు. అమరవీరుల ఫొటోలను కూడా సేకరించి ప్రదర్శించాలని సూచించారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ కూడా తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అమరవీరుల సంతాప తీర్మానానికి అన్ని పక్షాలు మద్దతు పలికాయి. దీంతో స్పీకర్ మధుసూదనాచారి అమరవీరుల సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన యువ కిశోరాలకు సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది.