త్వరలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ
కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు కసరత్తు
విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
నల్గొండ, జూన్ 17 (జనంసాక్షి) :
ఛాత్రోపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో నిర్వహి ంచిన జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయ న మాట్లాడుతూ, సీమాంధ్రుల పాలనలో విద్యారంగం అంతా అస్తవ్య స్తంగా తయారైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కేజీ టు పీజీ ఉచిత విద్య అమ లుకు ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యమిస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై త్వరలో సీఎం కేసీఆర్ నిర్వహించే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ముందుండి నడిచిన ఉపాధ్యాయులు తెలంగాణ పునర్నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కోరారు.