బేగంపేట క్యాంపు కార్యాలయంలోకి సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 22 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం బేగంపేటలోని అధికార నివాసం సీఎం క్యాంపు కార్యాలయానికి మారారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల తన స్వగృహం నుంచి ఆయన క్యాంపు కార్యాలయానికి షిఫ్ట్ అయ్యారు. ఉదయం సుదర్శనయాగం, వాస్తుపూజ తర్వాత కేసీఆర్ అధికార నివాసంలోకి ప్రవేశించారు. కేసీఆర్ ప్రస్తుత నివాసాన్ని ఆయన కుమారుడు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు
క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నారు. అయితే ఆయన సీఎం కేసీఆర్‌తో పాటే సీఎం క్యాంపు క్యాంపు కార్యాలయంలోనే నివాసముంటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, కేసీఆర్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.