బియాస్ మృతుల కుటుంబాలకు
రూ. 5లక్షల పరిహారం చెల్లించడండి
– హిమచల్ హైకోర్టు
సిమ్లా, జూన్25 (జనంసాక్షి):
బియాస్ నదిలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. వీరిద్దరిని బాధ్యులుగా గుర్తించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 8న జరిగిన ప్రమాదంలో 24 మంది విద్యార్థులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటివరకు కేవలం17 మృతదేహాలు మాత్రమే లభించాయి. ఇంకా 7 మృతదేహాల ఆచూకీ దొరకలేదు. జులై 9 నాటికి కళాశాల యాజమాన్యం ఈ అంశంపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా మిగతా మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది.