బియాస్ నదిలో మరో మృతదేహాం లభ్యం

హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇవాళ మరో మృతదేహాం లభ్యమైంది. లభ్యమైన మృతదేహాన్ని బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా గుర్తించారు. ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశారు. మరో నాలుగు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి