త్వరలో మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్
హైదరాబాద్: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, వారంలో స్టేట్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట విస్తృతస్థాయి సమావేశాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు
– వచ్చే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం.
-చట్టాలు, మార్గదర్శకాలు నూతనంగా రూపొందించుకోవాలి.
– రేషన్ కార్డుల జారీలో జరిగిన అక్రమాల బాధ్యులపై చర్యలు.
– గృహనిర్మాణాల్లో రూ. 235 కోట్ల అక్రమాలు జరిగాయి. బాధ్యులను జైలుకు పంపిస్తాం.
– ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్మీ ా’య్రర్మన్లకు 3 రోజులపాటు శిక్షణ ఇస్తాం.
– శాసనసభ, శాసనమండలి సభ్యులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు.
– గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వేర్వేరు ప్రణాళికల తయారీ.
– కొత్త ప్రాజెక్టుల్లో తాగునీరు, పరిశ్రమల కోసం నీటిని రిజర్వు చేయాలి.
– విత్తనాభివృద్ధికి అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణ.
– ప్రతిరైతు భూమిని ప్రభుత్వమే పరీక్షించి కంప్యూటరీకరిస్తుంది.
– రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తాం.
– వ్యవసాయ పరిశోధనాకేంద్రాలు ఏర్పాటుచేస్తాం.
– మెదక్‌లో చక్కెర పరిశోధనాకేంద్రం, నిజామాబాద్‌లో పసుపు పరిశోధనాకేంద్రం ఏర్పాటు.
– కృష్ణా- గోదావరి నీటిలో తెలంగాణ వాటా 1200 టీఎంసీలు.
– ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి కేటాయింపుల ఉత్తర్వులు ఉన్నాయి.
– మైనర్ ఇరిగేషన్ అభివృద్ధి యుద్ధప్రాతిపదికన జరగాలి. ప్రజలను భాగస్వాములను చేయాలి.
– రిజర్వ్ ఫారెస్ట్‌లో 100 కోట్ల మొక్కలు ఏర్పాటు.
– హెచ్‌ఎండీఏ పరిధలో 10 కోట్ల మొక్కలు నాటుతాం.
– హైదరాబాద్‌ను తెలంగాణకు ఆర్థిక వెన్నెముక చేస్తాం.
– ఐటీఐఆర్ పూర్తయితే హైదరాబాద్ మూడింతలుగా విస్తరిస్తుంది.
– అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తయారుచేస్తాం.
– అక్రమాలు, అరాచకాలకు హైదరాబాద్ సహా తెలంగాణలో తావుండదు.
– అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
– హైదరాబాద్ శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు.
– ప్రతిగ్రామానికీ డంపింగ్ యార్డు, స్మశానవాటిక.