లోక్‌సభను కుదిపేసిన ధరల పెరుగుదల.. రేపటికి వాయిదా!

 

లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని సోమవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళన చేస్తున్న సభ్యులు రెండోసారి వాయిదా అనంతరం ప్రారంభమైన సభలోనూ అదే డిమాండ్ చేశారు. ఇందుకు సమాధానమిచ్చిన మంత్రి వెంకయ్యనాయుడు, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 
అయితే, ఓటింగ్ లేకుండా ధరల పెరుగుదలపై చర్చ చేపట్టవద్దని విపక్షాలు ఆందోళన చేశాయి. అటు సమావేశాలు కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే కోరారు. అయినా, సభ్యులు వినకపోవడంతో మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 
అంతకుముందు.. ధరల పెరుగుదల అంశం మోడీ ప్రభుత్వానికి ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లోనే కాక సభ వెలుపల కూడా నిరసనల వెల్లువ స్వాగతం పలికింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో తొలిరోజు ప్రశ్నోత్తరాలకు అవకాశమే లేకుండా పోయింది. లోక్‌సభ ప్రారంభం కాగానే ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరపాలంటూ అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. 
దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే సభ వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చ జరపాలన్న పలు పార్టీల అభ్యర్థన మేరకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమ్మతం తెలపడంతో నేరుగా చర్చే ప్రారంభమైంది. ఇక పార్లమెంట్ వెలుపల పలు పార్టీల కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించార