రైతు బిడ్డలకే మార్కెట్ కమిటీ
త్వరలో రైతుబంధు పథకం
ప్రజల మధ్యే పాలసీ
ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి) :
రైతులకే మార్కెట్ కమిటీ పగ్గాలు అప్పగిస్తామని, గతంలో లాగా మార్కెట్ కమిటీల్లో రాజకీయాలు లేకుండా చూస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలను పూర్తిగా రైతులే ఏలేలా చేస్తామన్నారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు పథకం అమలుపై చర్చ ఏర్పాటు చేశారు. పాలసీలు సచివాలయంలో కాదు.. ప్రజల మధ్య రూపొందిస్తామని హరీశ్‌రావు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రైతులకు మాత్రమే పదవులు ఇస్తామన్నారు. త్వరలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. మార్టిగేజ్ లేకుండానే రూ.2 లక్షల వరకు రుణాన్ని ఇస్తామని తెలిపారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామన్నారు. మార్కెట్ యార్డుల్లో ఈ టెండరింగ్, ఈ మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డుల్లో పది రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే అన్ని సౌకర్యాలతో రైతు విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.13 వేల కోట్లతో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేట్లు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాల మేరకే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాన్ని గ్రామ స్థాయిలో రూపొందించేందుకే చర్చా వేదిక ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను సచివాలయంలో కాదు.. ప్రజల మధ్య రూపొందిస్తామన్నారు. ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. వ్యవసాయ మార్కెట్ల్ కమిటీలో రైతులకు మాత్రమే పదవులు ఇస్తామని తెలిపారు. మార్కెట్ యార్డల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రైతు విశ్రాంతి గదులు, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు, అవసరాల మేరకే మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని గ్రామస్థాయిలో రూపొందించేందుకే చర్చా వేదిక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఈ టెండరింగ్, ఈ మార్కెటింగ్ విధానాలను అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా ప్రభుత్వం ముందుకెళుతుందని తెలిపారు.