తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలి
– పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం
– తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్, జులై 10 (జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. ఎన్డీయే పక్షాలు పాలనలో ఉన్న రాష్ట్రాలకే కేటాయింపులు జరిగినట్టు వారు ఆరోపించారు. తెలంగాణలో ఎనిమిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో 14 అంశాలపై వినతిపత్రం ఇవ్వగా ఒక్క దానిపై కూడా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంపీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలతో సమావేశమయ్యారు. లోక్‌సభలో పోలవరంపై పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందకుండా ఉమ్మడిగా అడ్డుకోవాలని ఎంపీలు నిర్ణయించారు.